నాకు 38 ఏళ్లు 15 ఏళ్ల కిందటే నాకు పెళ్లయ్యింది 12 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. నా భర్త విదేశాల్లో ఉంటాడు. అప్పుడప్పుడు వచ్చి కొన్ని నెలలు ఉండి మళ్లీ వెళ్లిపోతాడు. అయితే, ఆయన లేని సమయంలో నేను మా టైలర్‌కు దగ్గరయ్యాను. అతడి సంబంధం వల్ల నేను ఇప్పుడు గర్భవతి అయ్యాను. ఇప్పుడు నాకు 5 నెలల గర్భం. నాకు అబార్షన్ చేయించుకోవాలని లేదు. అందుకే, ఈ విషయాన్ని నా భర్తకు ఫోన్ చేసి చెప్పేశాను. ఇందుకు ఆయన కూడా సానునుకూలంగా స్పందించాడు. నన్ను, నా పుట్టబోయే బిడ్డను చూసుకుంటానని హామీ ఇచ్చారు. డబ్బు సంపాదన కోసం ఇంటి నుంచి దూరంగా ఉండటం వల్లే నేను ఈ సంబంధం పెట్టుకున్నానని ఆయన అర్థం చేసుకున్నారు.అయితే, నాకు భర్తతో ఉండాలని లేదు. నా కడుపులోని బిడ్డకు తండ్రయిన టైలర్‌తోనే ఉండాలని అనుకుంటున్నా. అతడు నన్ను పెళ్లి చేసుకోడానికి సిద్ధంగా ఉన్నాడు. నా కొడుకుకు కూడా అతడంటే చాలా ఇష్టం. మరోవైపు నా భర్త ఇండియాకు తిరిగి రావడానికి ఇష్టపడటం లేదు. మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లలేనని అంటున్నాడు. ఇలా ఎంకెన్నాళ్లు నేను ఒంటరిగా జీవితం గడపాలి ? అందుకే నేను టైలర్ వద్దకు వెళ్లిపోవాలని అనుకున్నా. అదే నాకు సంతోషం ఇస్తుందని అనుకుంటున్నా..? నన్ను ఏం చేయమంటారు అని ఓ మహిళ డాక్టర్ కి లేక రాసింది…
