Phoenix పేరుతో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ. వి. శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్ మాదాపూర్ లోని స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ లో కళాకారుల సంక్షేమం కోసం Phoenix పేరుతో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ. వి. శ్రీనివాస్ గౌడ్ గారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా కారణంగా అన్ని రంగాలు తీవ్రంగా నష్టపోయాయని అన్నారు. సీఎం శ్రీ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ప్రభుత్వం రూపొందించిన కోవిడ్ నిబంధనలను పాటిస్తూ కళాకారులలో మనోధైర్యాన్ని నింపడానికి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ ఆధ్వర్యంలో ఈ ఎగ్జిబిషన్ ను ప్రారంభించామన్నారు.

ఈ ఎగ్జిబిషన్ ను నేటి నుంచి ఈ నెల 12 వ తేది వరకు సుమారు 6 రోజుల పాటు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ పెయింటింగ్, ఫోటో ఎగ్జిబిషన్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల నుండి ప్రముఖ పెయింటర్ లు శ్రీ ఆగచారీ, రీతూ జైన్, కాంత రెడ్డి, మోగు సింగ్, రియాజ్ అహ్మద్, మారేడు రాము, మధు కరువా, రఘు ఆకుల లతో పాటు 105 మంది కళాకారులు రూపొందించిన పెయింటింగ్ లు, ఫోటోగ్రఫీ లను ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శిస్తున్నామని అన్నారు.

దేశంలోనే అతిపెద్ద ఆర్ట్ గ్యాలరీ మన హైదరాబాద్ లో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు.
సీఎం కేసీఆర్ గారు, పురపాలక, పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి శ్రీ కేటీ.రామారావు గార్లు హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయి లో తీర్చిదిద్దాటం వల్ల నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెద్ద కంపెనీలు వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు.

కరోనా నేపథ్యంలో కళాకారులు పూర్తిగా నష్టపోయారు కాబట్టి మళ్ళీ నూతనంగా తమ కెరీర్ ను ఆరంభించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం కళాకారుల కోసం ఈ విన్నూత్న కార్యక్రమంను నిర్వహించటం జరిగిందన్నారు.

ఫీనిక్స్ అనగా నూతన ఆరంభం అని కోవిడ్ తరువాత కళాకారులు తమ వృత్తిని నూతనంగా ఆరంభించుతున్నారని అందుకు Phoenix అనే పేరు ను పెట్టడం జరిగిందని మంత్రి వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ డైరెక్టర్ డా.కె.లక్ష్మీ మరియు ప్రముఖ చిత్రకారులు పాల్గొన్నారు.