హామీలన్నీ పూర్తి చేస్తున్నాం..  రంగారెడ్డి నగర్ డివిజన్ లో రూ.1.80 కోట్ల అభివృద్ధి పనుల శంఖుస్థాపనలో ఎమ్మెల్యే..

గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి సహకారంతో కోట్ల నిధులు వెచ్చించి కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు అన్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 127 రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని గురుమూర్తి నగర్, ఇందిర గాంధీ నగర్, రంగారెడ్డి నగర్, పంచశీల కాలనీ లలో రూ.1.80 కోట్లతో నూతనంగా చేపడుతున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్ గారితో కలిసి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. నిధులకు కొరత లేకుండా ప్రతి కాలనీలో మెరుగైన మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నామని, కోట్ల నిధులను వెచ్చిస్తూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ప్రణాళికబద్ధంగా సమస్యలను అధిగమిస్తూ ప్రగతి బాటలో నడుస్తున్నామన్నారు. మంచి నీటి సరఫరా, రోడ్లు, భూగర్భ డ్రైనేజీ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు శాశ్వత పరిష్కారం చూపుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, వార్డు సభ్యులు, కాలని సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.