హారిక తన చెల్లి అని క్లారిటీ ఇచ్చిన అభిజిత్‌

తాజాగా  ఓ టీవీ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిజిత్‌ మాట్లాడుతూ.. హారిక తన చెల్లి అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. తనకు ఒక తమ్ముడు ఉన్నాడని, ఇక హారిక లాంటి చెల్లెలు కూడా ఉంటే బాగుంటుందని అనుకునేవాడినని, అందుకే ఆమెతో ఎక్కు టైం స్పెండ్‌ చేశానని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఈ విషయాన్ని హౌస్‌లో హారికకు ఎన్నోసార్లు చెప్పానని, అది బయటకు రాలేదని ఇప్పుడే తెలిసిందని అభి చెప్పుకొచ్చాడు. రేటింగ్‌ కోసమే బిగ్‌బాస్‌ అభి, హారిక రిలేషన్‌ని వేరుగా చూపించినట్లు అర్థమవుతుంది.