గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రతి డివిజన్ అభివృదే ప్రధాన లక్ష్యంగా టిఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతుంది..అరేకపూడి గాంధీ

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రతి డివిజన్ అభివృద్ధికి ఒక్క పక్క ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని,హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలో ప్రజలకు మెరుగైన మౌళికవసతులు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామని,గౌరవ మున్సిపల్ శాఖమంత్రివర్యులు శ్రీ.కేటీఆర్ గారి దిశానిర్దేశంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ,ప్రతి మౌళికవసతులు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు శేరిలింగంపల్లి శాసనసభ్యులు,ప్రభుత్వ విప్ శ్రీ.అరేకపూడి గాంధీ గారు మరియు హఫీజ్ పెట్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి.శ్రీ.వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ గారు..

ఈరోజు హఫీజ్ పెట్ డివిజన్ అభివృద్దిలో భాగంగా శేరిలింగంపల్లి శాసనసభ్యులు శ్రీ.అరేకపూడి గాంధీ గారు,మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు,జి.హెచ్.ఎం.సి అధికారులతో కలిసి సుమారు.310.80లక్షల వ్యయంతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు హఫీజ్ పెట్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి.శ్రీ.వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ గారు..

కార్పొరేటర్ గారు మాట్లాడుతూ..

హఫీజ్ పెట్ డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ,గౌరవ మున్సిపల్ శాఖమంత్రివర్యులు శ్రీ.కేటీఆర్ గారి దిశానిర్దేశంలో ప్రజలకు మౌళికవసతులు అందించేందుకు కృషి చేస్తున్నామని,అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

1.జనప్రియ ఫేస్.1 సాయి బాబా ఆలయం నందు మరియు అంతర్గత రోడ్ల నిర్మాణం కోరారు రూ 19.20లక్షలతో అభివృద్ధి పనులు..

2.ఓల్డ్ హఫీజ్ పెట్ గ్రామం నందు రూ.19.75 లక్షలతో అంతర్గత రోడ్డు నిర్మాణ పనులు.

3.యూత్ కాలనీ మరియు ప్రకాష్ నగర్ మరియు సాయి నగర్ నందు రూ.61.00 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు.

4.గజిటడ్ ఆఫీసర్స్ కాలనీ మరియు వైశాలి నగర్ నందు రూ.100.00లక్షలతో అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులు..

5.మైత్రి నగర్ ఫేస్.1 నందు రూ.23.50లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు..

6.హుడా కాలనీ ఫేస్.1 మరియు ఫేస్.2 నందు రూ.87.35 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే సీసీ రోడ్ల పునరుద్ధరణ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది..

ఈ కార్యక్రమంలో హఫీజ్ పెట్ డివిజన్ నాయకులు, కార్యకర్తలు, వార్డు మెంబర్లు, ఏరియా కమిటి మెంబర్లు, బూత్ కమిటి మెంబర్లు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు..