వరంగల్ తూర్పు అభివృద్ది..

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్ ను అభివృద్ది చేసే దిశగా 2016 లో రాష్ట్ర చరిత్రలో ఏటా 300 కోట్ల రూపాయలను వరంగల్ కు కేటాయించడం జరిగింది..ఆ సమయంలో నేను మేయర్ గా ఉండటం జరిగింది.900 కోట్ల నిదులతో అభివృద్ది,మార్కెట్ లు,ఇంటిగ్రేటెడ్ మార్కెట్,రోడ్లు డ్రైనేజీలు,స్మశానవాటికలు,కమ్యూనిటి హాల్స్ ఏర్పాటు చేసాం..మున్సిపల్ నిదులతో నగరమంతా 3000 కోట్ల నిదులతొ అభివృద్ది చేపట్టాం..

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వరంగల్ గ్రేయిన్ మార్కెట్ లో పనిచేసేవారంతా వరంగల్ తూర్పు నియోజకవర్గం వారు..ఇక్కడున్న ప్రజలకు పేదరికం తో ఉన్న ప్రజలే 80% ఉన్నారు.వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్న సంకల్పంతో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాం..

గేటు ఇవతల ప్రాంత ప్రజల చిరకాల కల అయిన అండర్ బ్రిడ్జ్ విస్తరణ పూర్తిచేసాం,

ఖిలావరంగల్ అగర్తలా నుండి వర్షపు నీరుకు శివనగర్ మునిగి పోకుండా 41 కోట్లతో పనులు చేపట్టాం..

ఆర్వోబి విస్తరణలో ఇండ్లు కోల్పోయిన వారికి 9 కోట్ల నిదులను ఏర్పాటు చేసి వారికి పరిహరం అందజేయటం జరిగింది..

– చరిత్ర కలిగిన గోవింద రాజుల గుట్ట ను 2 కోట్ల నిదులతో అభివృద్ది చేపట్టడం జరిగింది..

ఖిలా వరంగల్ ను టూరిజం హబ్ గా మార్చి ప్రపంచ యునెస్కో పటంలో నిలిపేందుకు అడుగులు వేయడం జరిగింది..900 కోట్లలో 250 కోట్లు వరంగల్ తూర్పు అభివృద్ది చేపట్టాం..కుడా నిదులతో జంక్షన్స్ ఏర్పాటు చేస్తున్నాం..

పాత బస్టాండ్ ను పునర్నిర్మించే విదంగా సీఎం కేసీఆర్ గారు అనుమతినిచ్చారు..

– 24 కోట్ల నిదులతో గజ్వెల్ తరహాలో ఇంటిగ్రేటెడ్ వెజ్&నాన్ వెజ్ మార్కెట్ ఏర్పాటు చేస్తున్నాం..

– రంగశాయిపేటలో 2.5 కోట్లతో మార్కెట్ ఏర్పాటు చేస్తున్నాం..

– రోడ్లు,కాలువలు,సెంట్రల్ లైటింగ్,సుందరీకరణ,డివైడర్లు,భద్రకాలి బండ్ అభివృద్ది చేపట్టాం..

– 220 కోట్లతో వరంగల్ తూర్పు తలాపున ఇన్నర్ రింగ్ రోడ్..

– కుడా ఆద్వర్యంలో 25 ఎకరాల స్థలంలో టూరిజం అభివృద్దికి రిసార్ట్ నిర్మాణం కోసం భూమిని కొనటం జరిగింది..

– ఖిలా వరంగల్ క్రీడా మైదానాన్ని ప్రైవేట్ వ్యక్తుల నుండి కొనుగోలు చేసి ప్రభుత్వం అభివృద్ది చేస్తుంది..

– సొంత ఖర్చులతో అద్వానంగా ఉన్న ఆజంజాహి మిల్ గ్రౌండ్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం జరిగింది..

ఆలయాల పునరుద్దరణ చేపట్టడానికి చర్యలు తీసుకోవటం జరిగింది.రాష్ట్రబడ్జెట్ లో ప్రత్యేక నిదులు ప్రభుత్వం ఏర్పాటు చేసింది.80% నిదులను ప్రభుత్వమే అందజేస్తుంది.ఆలయ కమిటీలతో కలిసి 20% దాతల సహకారంతో ఆలయాల అభివృద్ది చేస్తాం..

– ఖిలా వరంగల్ లో టూరిజం అభివృద్ది చెందితే ఉపాది అవకాశాలు,వ్యాపారాలు అభివృద్ది చెందుతాయి కాబట్టి టూరిజం అభివృద్ది చేపట్టడం జరిగింది..

– యువతకు వృత్తి ఉపాది శిక్షణకై కేంద్రం ఏర్పాటు చేయబోతున్నాం..యువతకు ఇది ఎంతో మేలు చేస్తుంది..

– పట్టణాలను ఆరోగ్యవంతమైన నగరాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాం..

– హన్మకొండ,వరంగల్ రెండు జిల్లాలుగా ఏర్పడితే జిల్లా కేంద్రం తూర్పు నియోజకవర్గంలో ఏర్పాటు కానుంది.

– నాకు వచ్చిన మొదటి అవకాశాన్ని నియోజకవర్గ అద్బుతంగా అభివృద్ది చేపడతున్నాం..

– 2200 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం జరుగుతుంది..1400 ఇండ్లు పూర్తికి సిద్దంగా ఉన్నాయి..కాలీ స్థలాలు ఉన్న వారికి ఇండ్లు అందజేస్తున్నాం..

గుడిసెవాసులకు సైతం ఆస్థిహక్కు కల్పించేందుకృ అసెంబ్లీలో మాట్లాడి ,ముఖ్యమంత్రి గారిని ఒప్పించి GO 58 ద్వారా 5400 మంది గుడిసెవాసులకు పట్టాలు అందజేయబోతున్నాం..నెరవేరనున్న పేదల ఆశల సౌదం..

– ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది..

వరంగల్ ఎంజిఎం,కాకతీయ మెడికల్ కాలేజీ,ఆయుర్వేద ఆసుపత్రులను అభివృద్ది చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ ముందుకు వెలుతున్నాం..

కరోనా కష్టకాలంలో 25వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేసాం..

– 12 బస్తీ దవఖానాలు ఏర్పాటు చేస్తున్నం..అన్నపూర్ణ కేంద్రాల ద్వారా 5 రూపాయలకే నాణ్యమైన బోజనం అందజేస్తున్నాం..

– షాదీఖానాలు,కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేసాం..

– సంఘటిత ,అసంఘటిత కార్మికుల భద్రతకై ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చేపడుతుంది..

– ప్రజల అవసరాలను గుర్తించి వారికి సేవ చేస్తున్నాం..

– మున్సిపల్ కార్పోరేషన్ లో ఉన్న కార్మికులకు తాను మేయర్ గా ఉన్న సమయంలో.ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ గారితో మాట్లాడి జీతాలు పెంచేందుకు కృషి చేయడం జరిగింది..,ఆరోగ్య పరిక్షలు నిర్వహించడం జరిగింది..

-వరంగల్ తూర్పులోని ప్రజలకు శాశ్వతంగా వరద సమస్యనుండి విముక్తి కోసం 125 కోట్లతో కాలువల నిర్మాణం..

– కరోనా సమయంలో ఇరుకుగా ఉన్న మార్కెట్ వల్ల ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశ్యంతో ఆజంజాయి మిల్ గ్రౌండ్ లో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ తాత్కాలిక మార్కెట్ ఏర్పాటు చేసి ప్రజలకు సేవలందించడం జరిగింది..