బోయినిపల్లి వినోద్ కుమార్ గారిని కలిసిన టి.టి.ఎల్.ఎఫ్ చైర్మన్ మాసం రత్నాకర్

మాజీ పార్లమెంటు సభ్యులు మరియు ప్రస్తుత ప్లానింగ్ కమిటీ రాష్ట్ర వైస్- ఛైర్మన్ శ్రీ బోయినిపల్లి వినోద్ కుమార్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన TTLF చైర్మన్ మాసం రత్నాకర్.తెలంగాణలో జరిగిన రెండు పట్టభద్రుల MLC ఎన్నికల ప్రచారంలో భారీ మెజారిటీ గెలుపుకోసం తెలంగాణ టీచర్స్ & లెక్చరర్స్ ఫోరమ్, రాష్ట్ర మరియు 6 జిల్లాల టి.టి.ఎల్.ఎఫ్ నాయకుల విశేష కృషిని గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళాలని TTLF, వ్యవస్థాపకులు & ఛైర్మన్ మాసం రత్నాకర్ పటేల్, వినోదుకుమార్ గారికి విజ్ఞప్తి చేసారు.  TTLF చేపట్టిన ఉద్యమానికి సహకారాన్ని అందించినందుకు వారికి TTLF పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రములో TTLF రాష్ట్ర, 6 జిల్లాల నాయకులు పాల్గొన్నారు.