గ్రేటర్ లో జోరుగా టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు

గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు జోరుగా సాగుతున్నది. ఈనెల 12న ప్రారంభమైన మెంబర్‌షిప్‌ డ్రైవ్‌ అన్ని నియోజకవర్గాల్లో ఊపందుకున్నది. ఒక్కో నియోజకవర్గంలో 50వేల మందిని సభ్యులుగా చేర్పించాలంటూ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు, ఇతర ప్రజాప్రతినిధులకు అధిష్టానం స్పష్టం చేసిన దరిమిలా ఆయా నియోజకవర్గాల్లో జాతరలా నిర్వర్తిస్తున్నారు. పాదయాత్రలు, టెంట్లు వేసి నాయకులు విస్తృతంగా సభ్యత్వ నమోదు ప్రక్రియను ముమ్మరం చేశారు. అయితే జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో గడువులోపే నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి చేయడం గమనార్హం. స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ ఆధ్వర్యంలో 50 వేల సభ్యత్వాలను పూర్తి చేశారు. 80వేల సభ్యత్వాలే లక్ష్యంగా మెంబర్‌షిప్‌ డ్రైవ్‌ కొనసాగిస్తున్నారు..ఇదే స్ఫూర్తితో అన్ని నియోజకవర్గాల్లో టార్గెట్‌ను పూర్తి చేస్తామని చెబుతున్నారు గులాబీ శ్రేణులు.

 విశేష ఆదరణ

గ్రేటర్‌లో ఎటూ చూసిన గులాబీ గుబాలిస్తున్నది. టీఆర్‌ఎస్‌ సభ్యత్వం తీసుకునేందుకు కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు, నాయకులు భారీగా తరలివస్తుండడంతో పార్టీ సభ్యత్వ నమోదు కేంద్రాలు ప్రత్యేక కళను సంతరించుకుంటున్నాయి. ఏ పార్టీకి లేని ఆదరణ గులాబీ పార్టీకి కనబడుతున్నది. పార్టీ సభ్యత్వం తీసుకున్నవారికి గతంలో మాదిరిగానే రూ.2 లక్షల ప్రమాద బీమా కల్పిస్తున్నారు.  క్రియాశీల సభ్యత్వానికి రూ. 100, ఎస్సీ, ఎస్టీలకు రూ. 50లు, సాధారణ సభ్యత్వం రూ. 30తో పార్టీ సభ్యత్వాలు తీసుకుంటున్నారు.

 రాష్ట్రంలో జూబ్లీహిల్స్‌ను అగ్రభాగాన నిలుపుతాం

టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. పలు కాలనీ వాసులు స్వచ్ఛంధంగా తరలివచ్చి సభ్యత్వాన్ని పొందుతున్నారు. ఎనిమిది రోజుల్లోనే మా లక్ష్యాన్ని చేరాం. గతేడాది కంటే ఈ సారి సభ్యత్వ నమోదులో జూబ్లీహిల్స్‌ నియోజవర్గాన్ని అగ్రభాగాన నిలుపే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు ఆదేశాల మేరకు శ్రేణులకు సభ్యత్వాల నమోదుపై దిశానిర్దేశం చేశాం. క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి సభ్యత్వాలు నిర్వహించే విధంగా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నాం. – మాగంటి గోపినాథ్‌, ఎమ్మెల్యే  జూబ్లీహిల్స్‌

టీఆర్‌ఎస్‌కు కార్యకర్తలే బలం బలగం

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరిస్తూ  చేపడుతున్న సభ్య త్వ నమోదు డ్రైవ్‌కు అన్ని వర్గాల ప్రజల నుంచి ఆదరణ లభిస్తున్నది. పార్టీ కార్యకర్తలకు, సభ్యులందరికీ గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ కట్టి, మరణించిన వాళ్లకు బీమా ఇస్తున్న పార్టీ దేశంలో టీఆర్‌ఎస్‌ ఒక్కటే. అంతేకాదు 65 లక్షల సభ్యత్వం ఉన్న పార్టీ కూడా ఒక్క టీఆర్‌ఎస్‌ మాత్రమే. ఇంతగా కార్యకర్తలకు మేలు చేస్తున్న పార్టీ కూడా టీఆర్‌ఎస్సే.  టీఆర్‌ఎస్‌ పార్టీకి కార్యకర్తలే బలం బలగం.  – కుర్మయ్యగారి నవీన్‌కుమార్‌ ఎమ్మెల్సీ

శామీర్‌పేట/మేడ్చల్‌,ఫిబ్రవరి21: దేశంలోనే అత్యంత ఎక్కువ సభ్యత్వం కలిగిన పార్టీ టీఆర్‌ఎస్‌ అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండలంలోని శామీర్‌పేట, అలియాబాద్‌, లాల్‌గడి మలక్‌పేట, తుర్కపల్లి గ్రామాల్లో ఆదివారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు ఆకర్శితులవుతున్నారని తెలిపారు. మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పార్టీ సభ్య త్వం తీసుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎల్లూబాయిబాబు, జిల్లా కో ఆప్షన్‌ సభ్యుడు జహీరుద్దీన్‌, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు సుదర్శన్‌, ప్రధాన కార్యదర్శి జగదీశ్‌గౌడ్‌, యూత్‌ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు కృష్ణారెడ్డి, సర్పంచ్‌లు బాలమణి, వనజశ్రీనివాస్‌రెడ్డి, కుమార్‌యాదవ్‌, మోహన్‌రెడ్డి, ఎంపీటీసీ సాయిబాబు, గ్రామాధ్యక్షులు శ్రీకాంత్‌గౌడ్‌, నర్సింగ్‌రావు, మల్లేశ్‌, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌, ఉపసర్పంచ్‌లు యూసఫ్‌బాబా, రమేశ్‌యాదవ్‌, మాజీ ఎంపీటీసీ ముత్యాలు ముదిరాజ్‌, ఫణిరాజ్‌, రాజిరెడ్డి, కుమార్‌, లింగం, మల్లేశ్‌యాదవ్‌, గోపి, రాజు, మధుసూదన్‌రెడ్డి, సోని, చాంద్‌పాషా, సాజిత్‌, వెంకట్‌రెడ్డి, నర్సింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 జిల్లాలో సభ్యత్వ నమోదుకు విశేష స్పందన

జిల్లాలో సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్‌ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 80వేల సభ్యత్వాలను పూర్తి చేసినట్లు వివరించారు. గత సంవత్సరం 93 వేల సభ్యత్వాలను చేసి రాష్ట్రంలోనే రెండో సాన్థంలో నిలిచామని, ఈ సంవత్సరం లక్షా10వేల సభ్యత్వాలను పూర్తి చేసి మేడ్చల్‌ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నంబర్‌వన్‌ స్థానంలో ఉండే విధంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు.

మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో జోరుగా నమోదు

జిల్లా పరిధిలోని  కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో సభ్యతాల నమోదు జోరుగా సాగుతుందని మంత్రి తెలిపారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందిన ప్రజలు వారు తమ ఇంటి పార్టీగా భావించి పార్టీని  మరింత పటిష్టం చేసేందుకు స్వచ్ఛందంగా  సభ్య త్వాలను స్వీకరించి సీఎం కేసీఆర్‌కు మద్దతు ఇచ్చేందుకు ముందుకొస్తు న్నారని మంత్రి పేర్కొన్నారు.

అమీర్‌పేట్‌, ఫిబ్రవరి 21: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ద్వారా తమకు మేలు జరిగిందని భావిస్తున్న ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పార్టీ సభ్యత్వాన్ని స్వీకరిస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పేర్కొన్నారు. ఆదివారం మారేడ్‌పల్లిలోని తన నివాసంలో జరిగిన సనత్‌నగర్‌ నియోజకవర్గ స్థాయి టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో సభ్యత్వ నమోదును మరింత చురుగ్గా చేసే విషయంలో పార్టీ శ్రేణులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విశేష ప్రజాధరణ పొందిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి తలసాని సాయికిరణ్‌యాదవ్‌తో పాటు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఉద్యమంలా టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు : డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌

సికింద్రాబాద్‌, ఫిబ్రవరి 21: టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు  కార్యక్రమాన్ని నేతలు, కార్యకర్తలు ఉద్యమంలా చేయిస్తున్నారని, ప్రజలు కూడా స్వచ్ఛందంగా సభ్యత్వం తీసుకోడానికి ముందుకొస్తున్నారని డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు తోబుల విష్ణు ఆధ్వర్యంలో మేడిబావిలో ఆదివారం టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ పథకాలను ప్రజలు ఎప్పుడు మరిచిపోరని, ఎప్పుడు వారికి అండగా నిలుస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో సీతాఫల్‌మండి డివిజన్‌ కార్పొరేటర్‌ సామలహేమ, నాయకులు పాల్గొన్నారు.

మా దేవుడు కేసీఆర్‌..

‘ సీఎం కేసీఆర్‌ మా దేవుడు. ఆయన ఇచ్చే పింఛన్‌తో సంతోషంగా బతుకుతున్నం. 2వేల రూపాయలతో మందులు, ఇతర ఖర్చులకు ఇబ్బంది లేకుండా ఉన్నది. కన్న కొడుకులు కూడా తల్లిదండ్రులను పట్టించుకోని ఈ రోజుల్లో.. నెల నెలా వచ్చే పింఛన్‌తో ఎవరి మీద ఆధారపడటంలే. గిట్ల ఎప్పుడూ పైసలు రాలే. అందుకే పార్టీలో చేరిన.’ అని గుండ్లపోచంపల్లికి చెందిన మురాడి సత్తెమ్మ చెప్పింది. సంతోషంగా టీఆర్‌ఎస్‌ సభ్యత్వం తీసుకున్న ఈమె.. తన మనసులోని మాటను బయటపెట్టింది.