టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పురాణం స‌తీష్‌కు క‌రోనా పాజిటివ్

హైద‌రాబాద్ : శాస‌న‌మండ‌లిలో క‌రోనా మ‌హ‌మ్మారి క‌ల‌క‌లం రేపింది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పురాణం స‌తీష్‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఇవాళ ఉద‌యం అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో నిర్వ‌హించిన క‌రోనా ప‌రీక్ష‌ల్లో స‌తీష్‌కు పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. శ‌నివారం రోజు ఎమ్మెల్సీ స‌తీష్‌.. మండ‌లికి హాజ‌రై బ‌డ్జెట్‌పై మాట్లాడారు. దీంతో మిగ‌తా మండ‌లి స‌భ్యులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. స‌భ్యులంద‌రూ క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించుకోవాల‌ని చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి సూచించారు.