నల్గొండ – వరంగల్- ఖమ్మం,మహబూబ్‌నగర్ -హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.రెండు స్థానాల్లో తెరాస అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.నల్గొండ – వరంగల్- ఖమ్మం నాల్గవ రౌండ్ లెక్కింపు పూర్తయ్యే సరికి తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమీప అభ్యర్థిపై 15442 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.మహబూబ్‌నగర్ -హైదరాబాద్-రంగారెడ్డి రెండవ రౌండ్ పూర్తయ్యే సరికి తెరాస అభ్యర్థి సురభి వాణీదేవి సమీప అభ్యర్థి రామచందర్‌రావుపై 2,613 ఓట్లతో స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు.