సినిమా థియేటర్స్ బంద్ చేయం : మంత్రి తలసాని

హైద‌రాబాద్ : సినిమా థియేట‌ర్ల మూసివేత‌పై తెలంగాణ ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌త‌నిచ్చింది. క‌రోనా కేసుల తీవ్ర‌త నేప‌థ్యంలో తెలంగాణ‌లో థియేట‌ర్లు మూసివేస్తార‌ని వ‌స్తున్న వార్త‌ల‌ను సినిమాటోగ్ర‌ఫి మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ఖండించారు. రాష్ర్టంలో సినిమా థియేట‌ర్ల‌ను మూసివేయ‌డం లేద‌ని తేల్చిచెప్పారు. థియేట‌ర్లు మూసివేస్తార‌న్న ప్ర‌చారాన్ని న‌మ్మొద్దు అని సూచించారు. కొవిడ్ నిబంధ‌న‌ల‌తో సినిమా థియేట‌ర్లు య‌థాత‌థంగా న‌డుస్తాయ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. థియేట‌ర్ల‌కు వెళ్లే ప్ర‌తి ఒక్క‌రూ కొవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని, విధిగా మాస్కు ధ‌రించి ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించాల‌ని మంత్రి త‌ల‌సాని విజ్ఞ‌ప్తి చేశారు.