నేటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు.. కాగ్ నివేదిక సమర్పించనున్న సర్కార్

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. చివరిరోజైన నేడు అసెంబ్లీ, శాస‌న‌మం‌డ‌లిలో ద్రవ్యవి‌ని‌మయ బిల్లును ప్రవే‌శ‌పెట్టనుంది. ఉదయం 10 గంట‌లకు ఉభయ సభలు ప్రారం‌భ‌మైన వెంటనే మొదట ప్రశ్నో‌త్తరా‌లు కొనసాగిస్తారు. ఆ తర్వాత ద్రవ్యవి‌ని‌మయ బిల్లుపై చర్చ జరుగుతుంది. అనంతరం అసెంబ్లీకి ప్రభుత్వం కాగ్‌ నివేదిక సమర్పించనుంద

శాస‌న‌స‌మం‌డ‌లిలో మాజీ ఎమ్మె‌ల్యేలు, ఎమ్మె‌ల్సీ‌లకు సంబం‌ధిం‌చిన బిల్లు, ప్రభుత్వ ఉద్యో‌గుల రిటై‌ర్‌‌మెంట్‌ పరి‌మి‌తిని 61 సంవ‌త్సరా‌లకు పెంచే బిల్లు‌లను ప్రభుత్వం ప్రవే‌శ‌పెట్టనున్నది. ఇప్పటికే ఈ సవరణ బిల్లు శాసనసభలో ఆమోదం పొందింది. ఆ తర్వాత ద్రవ్య విని‌మయ బిల్లుపై ప్రభుత్వం చర్చించ‌నున్నది. ఉభయసభలు వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్నాయి. ఆ తరు‌వాత శాసనమండలి, శాసనసభ నిర‌వ‌ధి‌కంగా వాయిదా వేయనున్నారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఈనెల 15న ప్రారంభమయ్యాయి. 18న ఆర్థికమంత్రి హరీశ్‌ రావు శాసనసభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 21, 22 తేదీల్లో బడ్జెట్ మీద చర్చ జరిగింది. ఈనెల 23, 24, 25 తేదీల్లో శాఖలవారీగా పద్దులపై చర్చించారు. మూడురోజుల చర్చలో మొత్తం 38 పద్దులను అసెంబ్లీ ఆమోదించింది.