పోలీసుల అదుపులో  ష‌ణ్ముక్ జ‌శ్వంత్‌

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని జూబ్లీహిల్స్ రోడ్ నంబ‌రు 10లో రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించింది. యూట్యూబ్ ఫేమ్‌, టిక్‌టాక్ స్టార్ ష‌ణ్ముక్ జ‌శ్వంత్ న‌డుపుతున్న కారు అదుపుత‌ప్పి మ‌రో రెండు కార్లు, రెండు బైక్‌ల‌ను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో బైక్‌పై ప్ర‌యాణిస్తున్న ఓ వ్య‌క్తి తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. దీంతో ప్ర‌మాదానికి కార‌ణ‌మైన ష‌ణ్ముక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారును సీజ్ చేశారు. అతివేగ‌మే ప్ర‌మాదానికి కార‌ణ‌మని ప్రాథ‌మిక స‌మాచారం.