బడ్జెట్‌లో ఎన్నారైలకు ప్రత్యేక నిధుల కేటాయింపులు చేయాలని వినతి

హైదరాబాద్‌ : రాబోయే బ‌డ్జెట్ స‌మావేశాల్లో ఎన్నారైలకు ప్రత్యేక నిధుల కేటాయింపులు చేయాలని టీఆర్‌ఎస్‌ ఎన్నారై శాఖ కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల సీఎం కేసీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మహేష్‌ బిగాల మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. అభివృద్ధిలో తెలంగాణ అగ్రగామిగా నిలిచింద‌ని పేర్కొన్నారు. అలాగే ఎన్నారైలకు కూడా సముచితంగా నిధులుకేటాయింపులు చేసి అందరికి మేలు జరిగేలా చూడాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. దీనికి  ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. అలాగే ధరణిలో ఆధార్ లేని వాళ్లకు పాసుపోర్టు ద్వారా అప్లై చేసుకొనే విధంగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.