హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం

ఉప‌రి‌తల ద్రోణి ప్రభా‌వంతో హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం పలు చోట్ల వర్షం కురిసింది. సోమాజీగూడ, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, సనత్‌నగర్‌, బేగంపేట,జూబ్లీహిల్స్,బంజారాహిల్స్, ఫిలింనగర్, హైటెక్ సిటీ, మాదాపూర్, కొంపల్లి, చింతల్, బోయిన్‌పల్లి, జీడిమెట్ల, సూరారంలో ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగింది. వెంటనే అప్రమత్తమయిన జీహెచ్‌ఎంసీ అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

గత అర్థరాత్రి కూడా నగరంలో వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. కాగా రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కర్ణా‌టక నుంచి దక్షిణ మధ్య మహా‌రాష్ట్ర వరకు ఏర్పడిన ఉప‌రి‌తల ద్రోణి ప్రభావంతో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉం‍దని తెలిపింది.