విద్యుత్ ఛార్జీలు పెంచే ఆలోచ‌న లేదు

హైద‌రాబాద్ : రాష్ర్టంలో విద్యుత్ చార్జీలు పెంచే ఆలోచ‌న లేద‌ని విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. శాస‌న‌మండ‌లిలో విద్యుత్ ఛార్జీల విష‌యంలో స‌భ్యులు లేవ‌నెత్తిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌మాధానం ఇచ్చారు. క‌రోనా సంక్షోభ స‌మ‌యంలో విద్యుత్ సంస్థ‌ల‌కు న‌ష్టాలు వ‌చ్చాయి. అయిన‌ప్ప‌టికీ విద్యుత్ చార్జీలు పెంచే ఆలోచ‌న లేద‌ని స్ప‌ష్టం చేశారు. కొవిడ్ సంద‌ర్భంలో బిల్లులు ఎక్కువ వ‌చ్చాయ‌ని చెప్ప‌డం నిరాధార‌మ‌న్నారు. కొంత‌మంది కావాల‌ని చెప్పి.. విద్యుత్ రంగంపై అన‌వ‌స‌ర పుకార్లు సృష్టించారు. సాంకేతిక లోపం కార‌ణంగానే కొన్ని చోట్ల బిల్లులు అధికంగా వ‌చ్చిన మాట వాస్త‌వ‌మే. అది త‌మ దృష్టికి వ‌చ్చిన త‌ర్వాత ఆ బిల్లుల‌ను స‌రిదిద్దామ‌ని మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి పేర్కొన్నారు.