మూడో రౌండ్‌ ‘పల్లా’దే..

హైదరాబాద్‌ : నల్గొండ – వరంగల్‌- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. మూడో రౌండ్‌లో పల్లాకు 15,558 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న (నవీన్‌కుమార్‌)కు 10,748, ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు 11,032, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌కు 6,615, కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌కు 4,354 ఓట్లు పోలయ్యాయి. మరో 2,789 ఓట్లు చెల్లకుండాపోయాయి. మూడు రౌండ్లలో కలిపి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లాకు 47,545, నవీన్‌కుమార్‌కు 34,864, కోదండరామ్‌కు 29,560 ఓట్లు వచ్చాయి. పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమీప అభ్యర్థిపై 12,681 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published.