నాల్గవ రౌండ్ “పల్లా”దే

హైదరాబాద్‌ : నల్గొండ – వరంగల్‌- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. నాల్గవ రౌండ్‌లో పల్లాకు 15,898 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న (నవీన్‌కుమార్‌)కు 12,143, ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు 9987. మరో 2,789 ఓట్లు చెల్లకుండాపోయాయి. నాలుగు రౌండ్లలో కలిపి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లాకు 63443, నవీన్‌కుమార్‌కు 48001, కోదండరామ్‌కు 39554 ఓట్లు వచ్చాయి. పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమీప అభ్యర్థిపై 15442 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.