తెలంగాణ‌లో మే 1 వ‌ర‌కు నైట్ క‌ర్ఫ్యూ

హైద‌రాబాద్ : క‌రోనా మ‌హ‌మ్మారి ఉధృతి దృష్ట్యా తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇవాళ్టి నుంచి మే 1వ తేదీ ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు రాష్ర్టంలో రాత్రి క‌ర్ఫ్యూ విధించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. క‌ర్ఫ్యూ నుంచి అత్య‌వ‌స‌ర స‌ర్వీసులు, పెట్రోల్ బంక్‌లు, మీడియాకు మిన‌హాయింపు ఇచ్చారు. రాత్రి 9 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు నైట్ క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉండ‌నుంది. నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోనున్నారు.