సా‌గర్‌లో మొదలైన నామి‌నే‌షన్లు

నిడ‌మ‌నూరు : నాగా‌ర్జు‌న‌సా‌గర్‌ ఉప‌ఎ‌న్నికకు ఎన్ని‌కల సంఘం మంగ‌ళ‌వారం నోటి‌ఫి‌కే‌షన్‌ విడు‌దలచేయ‌ను‌న్నది. మంగ‌ళ‌వారం నుంచి ఈ నెల 30 వరకు అభ్య‌ర్థుల నుంచి నామి‌నే‌ష‌న్లను స్వీక‌రిం‌చ‌ను‌న్నది. ఇందు‌కోసం నిడ‌మ‌నూరు తాసిల్‌ కార్యా‌ల‌యంలో అధి‌కా‌రులు ఏర్పా ట్లు చేశారు. నామి‌నే‌షన్ల స్వీక‌ర‌ణకు ప్రత్యేక చాంబర్‌, హెల్ప్‌ డెస్క్‌ ఏర్పా‌టు‌చే‌శారు. నామి‌నే‌షన్లు సమ‌ర్పించే సమ‌యం లో కొవిడ్‌ నిబం‌ధ‌నల మేరకు అభ్య‌ర్థి‌తో‌పాటు ఒక్క‌రినే అను‌మ‌తిం‌చ‌ను‌న్నారు. ఎన్ని‌కల రిట‌ర్నింగ్‌ అధి‌కారి, మి ర్యా‌ల‌గూడ ఆర్డీవో రో‌హి‌త్‌‌సింగ్‌ ఏర్పా‌ట్లను పర్య‌వే‌క్షి‌స్తు‌న్నారు. సాగర్‌ నియో‌జ‌క‌వ‌ర్గంలో 2,19,745 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 1,08,907 మంది పురు‌షులు, 1,10,838 మంది మహి‌ళలు ఉన్నారు.