రెండో రౌండ్‌లోనూ వాణీదేవి ఆధిక్యం

హైదరాబాద్‌ : మహబూబ్‌నగర్‌ -హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రెండో రౌండ్‌ ముగిసే వరకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవి ఆధిక్యంలో ఉన్నారు. సమీప అభ్యర్థి రామచందర్‌రావుపై 2,613 ఓట్లతో ఆధిక్యం సాధించారు. ప్రస్తుతం మూడో రౌండ్‌ కౌంటింగ్‌ కొనసాగుతోంది. రెండో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 17,732, బీజేపీకి 16,173, నాగేశ్వర్‌ 8,594, కాంగ్రెస్‌కు 4,980 ఓట్లు పోలయ్యాయి. అలాగే ఈ రౌండ్‌లోనూ 3,375 ఓట్లు చెల్లలేదు. రెండు రౌండ్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవికి 35,171 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థికి 32,558 ఓట్లు వచ్చాయి.