హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు నిలిచిపోయింది.రెండో ప్రాధాన్యతఓట్ల లెక్కింపులో తలెత్తిన గందరగోళంతో సిబ్బంది కౌంటింగ్ నిలిపివేశారు. 8 మంది అభ్యర్థుల ఎలిమినేషన్‌లో 50 ఓట్లు గల్లంతైనట్లు
సిబ్బంది తెలిపారు. ఓట్ల గల్లంతుపై భాజపా-కాంగ్రెస్ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆర్వోకు ఫిర్యాదు చేశారు.