న‌ర్సంపేట్ – కొత్త‌గూడ రోడ్డు ప‌నుల‌పై మంత్రి వివ‌ర‌ణ‌

హైద‌రాబాద్ : శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా న‌ర్సంపేట్‌ – కొత్త‌గూడ రోడ్డు ప‌నుల‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి స‌మాధానం ఇచ్చారు. ఈ రోడ్డు రెండు భాగాలుగా క‌లిగి ఉంది. ఒక‌టి న‌ర్సంపేట – పాకాల రోడ్డు(9 కిలోమీట‌ర్లు)ను డీఎంఎఫ్‌టీ కింద మంజూరు చేశాం. ఇల్లందు – పాకాల రోడ్డు(25 కిలోమీట‌ర్లు)ను ఇప్ప‌టికే మంజూరు చేశామ‌న్నారు. ఒక‌టో రోడ్డు ప‌నుల కోసం టెండ‌ర్ల‌ను ఆహ్వానించామ‌న్నారు. రెండో భాగం రోడ్డు ప‌నులకు టెండ‌ర్లు పూర్త‌య్యాయి. వ‌న్య‌ప్రాణుల బోర్డు అనుమ‌తి ఇవ్వ‌డంలో జాప్యం వ‌ల్ల రెండో భాగం రోడ్డు ప‌నుల్లో ఆల‌స్యం జ‌రుగుతుంద‌న్నారు. రెండు నెల‌ల్లో న‌ర్సంపేట – పాకాల రోడ్డు ప‌నులు ప్రారంభ‌మ‌య్యేలా చూస్తామ‌న్నారు. త్వ‌ర‌లోనే ఫారెస్టు డిపార్ట్‌మెంట్ నుంచి అనుమ‌తి రాగానే ఇల్లందు – పాకాల రోడ్డు ప‌నులు ప్రారంభిస్తామ‌న్నారు.