లాక్‌డౌన్‌ వద్దంటే.. మాస్క్‌ తప్పనిసరి
  • కరోనా వైరస్‌ నిర్మూలన మన అందరి బాధ్యత మంత్రి కే తారకరామారావు
  • కూకట్‌పల్లిలో పలు అభివృద్ధి పనుల ప్రారంభం

లాక్‌డౌన్‌ వద్దంటే.. మాస్క్‌ తప్పనిసరి
రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్‌ రావొద్దంటే అందరూ తప్పనిసరిగా మాస్కు లు ధరించాలని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు.

కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్‌ సోకకుండా ప్రజలంతా జాగ్రత్తంగా ఉండాలని సూచించారు. ఇండ్ల నుంచి బయటకు రావాలంటే విధిగా మాస్క్‌ ధరించాలని చెప్పారు. కరోనా నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో రూ.71.49 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ఠి పనులను మంత్రి సోమవా రం ప్రారంభించారు. మూసాపేట్‌ సర్కిల్‌లో ని అంబేద్కర్‌నగర్‌ నుంచి డంపింగ్‌ యార్డ్‌ వరకు రూ.99 లక్షలతో నిర్మించనున్న వీడీసీసీ రోడ్డు పనులకు శంకుస్థాపనచేశారు. కేపీహెచ్‌బీ కాలనీ నాలుగో ఫేజ్‌లో రూ.3.50 కోట్లతో నిర్మించిన మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాల్‌ ను ప్రారంభించారు. హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్‌ వద్ద రూ.66.59 కోట్లతో నిర్మించిన రైల్వే అండర్‌ బ్రిడ్జిని ప్రారంభించారు. తీవ్రమైన ట్రాఫిక్‌ రద్దీ ఉండే మార్గంలో దాదాపు 410 మీటర్ల పొడవు, 20.60 మీటర్ల వెడల్పు కలిగిన ఈ ఆర్‌యూబీతో వాహనదారులకు ట్రాఫిక్‌ సమస్యలు తొలగనున్నాయి. రూ.40 లక్షలతో నిర్మించిన బ్రాహ్మణ కమ్యూనిటీహాల్‌ను కూడా మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

శివారుల్లో 3,500 కోట్లతోడ్రైనేజీ వ్యవస్థ
జీహెచ్‌ఎంసీలో విలీనమైన శివారు ము న్సిపాలిటీల్లో రూ.3,500 కోట్లతో సమగ్ర డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. గతంలో రూ.3వేల కోట్లతో శివారు ప్రాంతాలకు తాగునీటి కొరత లేకుండా చేశామని, రూ.3,500 కోట్లతో డ్రైనేజీ, సీవరేజ్‌ ఆధునీకరణ పనులు చేపడతామని చెప్పారు. నగరంలో వర్షాల వల్ల కాలనీలు, బస్తీలు ముంపునకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. కైతలాపూర్‌లోని డంపింగ్‌యార్డ్‌కు శాశ్వత పరిష్కారంగా ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ను ఆధునీకరించడం ద్వారా స్థానికులకు ఇబ్బందులులేకుండా చర్యలు చేపడతామని హామీ ఇచ్చా రు. కైతలాపూర్‌లో గతంలో పేదలకు నిర్మించిన గృహాలకు మరమ్మతులు చేయిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్‌రా వు, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలతరెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌ పాటిమీది జగన్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.