బొద్దుగొండ-కొల్లాపురం గ్రామాల్లో కోటి వృక్షార్పణ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా కోటి వృక్షార్పణ కార్యక్రమంలో పాల్గొనాలని ఎంపీ జోగినపల్లి సంతోష్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని బొద్దుగొండ-కొల్లాపురం గ్రామాల్లో ఎంపీటీసీ గుర్రం కవిత వెంకన్న లతో పాటు ఆయా గ్రామాల సర్పంచ్ లు ముక్కా లక్ష్మణ్ రావు,పిన్నింటి సుధాకర్ మొక్కలు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు తెరాస నాయకులు,కార్యకర్తలు,గ్రామస్తులు పాల్గొన్నారు.