అంతర్జాతీయ నివేదికలో కరీంనగర్‌
  • పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహిస్తున్నదని కితాబు
  • దేశవ్యాప్తంగా కేవలం 13 నగరాలకే చోటు

న్యూఢిల్లీ పునరుత్పాదక ఇంధనాన్ని (రెన్యూవెబుల్‌ ఎనర్జీ) ప్రోత్సహించే దిశగా భారత్‌లో 13 నగరాలు మాత్రమే విధానాలను రూపకల్పన చేయగా వాటిలో కరీంనగర్‌ కూడా ఉందని గ్రీన్‌ ఎనర్జీ పాలసీ నెట్‌వర్క్‌ అనే అంతర్జాతీయ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. కొత్తగా నిర్మించే భవనాల వైశాల్యం 2,700 చదరపు అడుగులు దాటితే ఇండ్ల పైకప్పుపై సోలార్‌ రూఫ్‌ టాప్‌ అమర్చేలా కరీంనగర్‌ మునిసిపాలిటీ 2019లో నిబంధన తెచ్చిందని పేర్కొన్నది. 2050 వరకు శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించి పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని దానితో సమానం చేయాలని ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై లక్ష్యాలుగా పెట్టుకొన్నాయని తెలిపింది.