హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు..

హైదరాబాద్‌ : మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 89 మంది అభ్యర్థులను ఎలిమినేట్‌ చేశారు. ఈ ప్రక్రియ ముగిసే వరకు లభించిన రెండో ప్రాధాన్యం ఓట్లు టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 6,930, బీజేపీకి 5,832, స్వతంత్ర అభ్యర్థి నాగేశ్వర్‌రావుకు 6,930, కాంగ్రెస్‌ అభ్యర్థికి 5,172 జమ చేశారు. ఎలిమినేషన్‌ ప్రక్రియ ముగిసే వరకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవికి 1,19,619 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుకు 1,10,500 ఓట్లు, ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌రావుకు 59,648 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డికి 36,726 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థిపై టీఆర్‌ఎస్‌ అభ్యర్థి 9,119 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ అభ్యర్థి ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించారు.