‘హైదరాబాద్‌’లో ఆరు రౌండ్లు పూర్తి.. ఆధిక్యంలోనే టీఆర్‌ఎస్

హైదరాబాద్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‎నగర్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకు ఆరు రౌండ్లు పూర్తయ్యాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవి 7,626 ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆరు రౌండ్లలో టీఆర్‌ఎస్‌కు 1,05,710 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుకు 98,084 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్‌ నాగేశ్వర్‎కు 50,450 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 29,627, టీడీపీ అభ్యర్థి ఎల్‌. రమణకు 5,606 ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఆరు రౌండ్లలో కలిపి 19,914 ఓట్లు చెల్లుబాటుకాలేదు.