మహత్ముడికి ఘన నివాళి

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని బాపు ఘాట్ వ‌ద్ద‌ జాతిపిత మ‌హాత్మా గాంధీ వ‌ర్ధంతి వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. మ‌హాత్ముడి విగ్ర‌హాం వ‌ద్ద‌ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ పుష్ప‌గుచ్ఛం ఉంచి నివాళుల‌ర్పించారు. మ‌హాత్ముడికి నివాళుల‌ర్పించిన వారిలో  హిమాచ‌ల్ ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌, శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లి ఛైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, మంత్రులు కేటీఆర్‌, మ‌హ‌ముద్ అలీ, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, ఎమ్మెల్యేలు దానం నాగేంద‌ర్‌, ముఠా గోపాల్‌, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, డిప్యూటీ మేయ‌ర్ బాబా ఫ‌సీయుద్దీన్‌, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి  సోమేశ్ కుమార్‌, హైద‌రాబాద్ క‌లెక్ట‌ర్ శ్వేతా మ‌హంతి, హైద‌రాబాద్ సీపీ అంజ‌నీ కుమార్‌తో పాటు ప‌లువురు నివాళుల‌ర్పించారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వీరంతా రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.

 

అసెంబ్లీలో మ‌హాత్ముడికి ఘ‌న నివాళులు

తెలంగాణ అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లోని మ‌హాత్మాగాంధీ విగ్ర‌హానికి పూల‌మాల వేసి ఘ‌న నివాళుల‌ర్పించారు. మ‌హ్మాతుడి వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న విగ్ర‌హానికి నివాళుల‌ర్పించిన వారిలో శాస‌న‌స‌భ‌ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, మండ‌లి ‌చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి గారు, హోంమంత్రి మ‌హముద్ అలీ గారు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ గారు, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత‌ మహేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీలు బోడ‌కుంటి వెంక‌టేశ్వ‌ర్లు గారు, నేతి విద్యాసాగ‌ర్‌ గారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే భ‌ట్టి విక్ర‌మార్క గారు ఉన్నారు. ఈ సంద‌ర్భంగా గాంధీ సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు