చరిత్రలో ఉండాలనకుంటారు అందరూ….  చరిత్రనే సృష్టిస్తారు ఇంకొందరు…

సువిశాల సుభిక్ష ప్రాంతం

ఆరుగాలం కష్టించే మంచి మనుషులు,

క్రిష్ణా గోదావరి జీవనదుల నడుమ పండే పచ్చని పసిడిపంటలు,

శాతవాహనుల, కాకతీయుల రాజసంతో అలరారే దక్కన్ పీఠభూమి మన తెలంగాణ.

 

ఐదు దశాబ్దాల పాటు రజాకార్ల దౌర్జన్యాలపై తెలంగాణ సాయుద రైతాంగం పోరాడిన తీరు ప్రపంచంలోనే అత్యున్నతంగా నిలిచింది

1947 ఆగస్టు పదిహేనున యావత్ బారతదేశం స్వేచ్చా స్వతంత్రాల్ని ఆస్వాదిస్తుంటే తెలంగాణ మాత్రం తన అస్థిత్వం కోసం 1948 సెప్టెంబర్ 17 వరకూ సింహగర్జన చేస్తూనే ఉంది.

సర్థార్ పటేల్ నేత్రుత్వంలో భారత ప్రభుత్వం చేసిన సైనిక చర్య మెదలు 1952 మార్చి 6న ప్రజాస్వామ్య పాలన వరకూ తెలంగాణ ఇటు భూర్జువా శక్తులతో పాటు అటు సైనిక ఆగడాలపై తన పోరాటాన్ని కొనసాగిస్తూనే వచ్చింది. ఐతే ఈ స్వతంత్రాన్ని కభలించడానికి వలసవాదులు కాచుకొన్న సత్యాన్ని నేడు గమనించలేకపోయింది.

ఇలాంటి ఒక అస్పష్ట, అనిశ్చిత, అయోమయ పరిస్థితుల్లో, మెతుకు సీమ దుబ్బాకనానుకున్న చింతమడకలో ఉన్నత కుంటుంబంలో 1954 పిభ్రవరి 17న రాఘవరావు, వెంకటమ్మ పుణ్య దంపతులకు యోదుడు జన్మించాడు.

తెలంగాణకు రాబోయే రోజుల్లో పట్టె వలసచీడను తొలగించే నాయకుడు జనించాడు,

ఆత్మగౌరవాన్ని మేల్కొలిపే సూర్యుడు ఉదయించాడు,

ఉద్యమాలకు సరికొత్త దిశను చూపించే మహాత్ముడు నడిచొచ్చాడు.

అతడే కేసీఆర్ – కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,

చింతమడకలో ప్రాథమిక విద్యానంతరం దుబ్బాకలో రాఘవరెడ్డి సార్ ఇంట్లో ఉంటూ ఉన్నత విద్యను అభ్యసించే రోజుల్లో మహా మహా అవదానులు సైతం తడబడే కఠోర పద్యాలను రాగరంజితంగా పాడిన సహజ సిద్ద ఏక సంథాగ్రాహి కేసీఆర్

చదువులో మేటి అనిపించుకున్నా, నాటి తన స్నేహితులు, గ్రామంలోని దుర్బర పరిస్థితులు ఆ చిన్ననాడే అతన్ని సమాజం కోసం ఆలోచించేలా ప్రేరేపించాయి.

వలస పాలన లో నీళ్లు లేక ఎండిపోతున్న పొలాలు, ఉపాదిలేక చిక్కిపోతున్న జనాలు, గ్రాసం లేక అల్లాడుతున్న పశుపక్ష్యాదులు, ఎదిగిన యవ్వనం బొగ్గుబాయికో, బొంబాయికో, దుబాయికో కడుపునింపుకొనే ఉపాదికోసం వలసపోతుంటే…. నిండిన వ్రుద్దాప్యం దూపతీర్చుకోవడం కోసం గుక్కెడు నీళ్లుదొరక్క అల్లాడుతుంది. ఎక్కడచూసినా తెలంగాణలో అరిగోసలు మెదలయ్యాయి.

ఈ పరిస్థితుల్లో 1969లో తెలంగాణ తొలి దశ అస్థిత్వ పోరు మెదలయింది. యావత్ తెలంగాణ నా రాష్ట్రం నా హక్కు అని ఆత్మగౌరవ యుద్దం మెదలయింది.

ముల్కీ గో బ్యాక్ అంటూ ముక్త కంఠంతో నినదించింది.

ఈ పోరును అణచడానికి ప్రభుత్వం చేసిన దమనకాండలో వేలాది తెలంగాన బిడ్డలు అహుతయ్యారు.

ఆంధ్ర పెత్తందారుల చెరలో చిక్కుకున్న తెలంగాణను విడిపంచే నాయకుడి కోసం ఎదురుచూస్తుంది సమాజం.

ఔను ఈ అబాగ్యులకు అండగా నిలబడి తెలంగాణను విముక్తి చేసే ఒక నాయకుడు కావాలి.

అప్పుడు కేసీఆర్ వయసు పదిహేనేళ్లు, రగులుతున్న తెలంగాణని స్వగతం చేసుకొనే వయసది

పై చదువుల కోసం సిద్దిపేట ప్రభుత్వ కాలేజీలో చేరిన కేసీఆర్ కాలేజీ ఎన్నికల సంగ్రామంలోకి దిగి ఓడిపోయాడు.

ఐనా పట్టువిడవని కేసీఆర్ విస్రుత పఠనానికి తెరతీసాడు, వందల గ్రందాల్ని చదువుతున్నా కోద్దీ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల గురించి తన విద్యాభ్యాసం ముగిసే లోపు మరింత లోతైన అవగాహన ఏర్పడింది.

ఎప్పటికైనా తెలంగాణను సాదించే నాయకుడి కోసం పడిగాపులు కాస్తూనే ఉంది

నాయకత్వ లక్షణాలను పునికిపుచ్చుకున్న కేసీఆర్ మదన్ మోహన్ దగ్గర రాజకీయ ఓనమాలు నేర్చుకున్నాడు, యూత్ కాంగ్రెస్ నాయకుడయ్యాడు.

రాష్ట్రమంతా రాజకీయ అనిశ్చితి నెలకొన్న  పరిస్తితుల్లో ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం చేశాడు, కొత్తగా వస్తున్న నేత తెలంగాణ అభివ్రుద్దికి తోడ్పడుతాడేమోనని 1983లో ప్రత్యక్ష రాజకీయల్లోకి ప్రవేశించి సిద్దిపేట ఎమ్మెల్యేగా పోటీచేసాడు.

ఇక్కడా రాజకీయ తొలి ఓటమి ఎదురయినా ప్రజలకు సేవచేయాలనే తన సంకల్పం మత్రం మారలేదు

1985లో తొలిసారి సిద్దిపేట ఎమ్మెల్యేగా  విజయబావుటాని ఎగరేసాడు. ఇక అప్పటినుండి ఇప్పటి వరకూ నాలుగు దశబ్దాలుగా ఓటమే కేసీఆర్‌ని చూసి భయపడుతుంది.

సింగల్ విండో చైర్మన్‌గా పనిచేసిన అనుభవం, ప్రజలిచ్చిన అవకాశం సిద్దిపేటను రాష్ట్రానికే రోల్ మాడల్‌గా తీర్చిదిద్దడానికి నిమగ్నమయ్యాడు కేసీఆర్.

నీటికోసం మన రాష్ట్రం అమలుచేస్తున్న నేటి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు మూలం ఎనబయ్యే దశకంలో సిద్దిపేటలో చేసిన ప్రయోగాలే

ఈ ప్రయాణంలో కేసీఆర్ ప్రతీ పనికి సంపూర్ణ మద్దతునిస్తూ ఎత్తుపల్లాలో చేదోడు వాదోడులా నిలిచింది శోభమ్మ. తెలంగాణే ప్రాణంగా బతుకుతున్న ఈ జంట కడుపున అదే స్పూర్తితో పుట్టిన పిల్లలు కేటీఆర్, కవితలు.

దశాభ్దంన్నర కాలంలో ప్రబుత్వంలో ఉణ్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా తెలంగాన కోసం ఎంత శ్రమించినా పరిస్థితుల్లో మార్పులేదు,

ఉద్యోగాల్లో ద్రోహం, వనరుల్లో ద్రోహం, నీటిపంపకాల్లో మోసం, అభివ్రుద్దిలో అలసత్వం, మిగులు బడ్జెట్‌తో ఆర్థికంగా ముందున్న తెలంగాణ అన్నిరంగాల్లో యాస, భాష వెక్కిరింపులతో ఆత్మాభిమానంపై చేసిన దాడితో అణిచివేయబడింది. చివరకు తెలంగాణ అన్న పదమే నిషేదాక్షరి అయిపోయింది. వలస ప్రభుత్వ విదానాలతో రోజు రోజుకు మరింత దుర్బర పరిస్థితులు ఎదురయ్యాయి. దీనికి తోడు అన్నంపెట్టే రైతన్నలపై బషీర్ బాగ్‌లో ప్రభుత్వం చేసిన కాల్పుల్లో బలైపోయిన రైతులను చూసి చలించిపోయాడు కేసీఆర్.

 

69నాటి పరిస్థితులే మల్లీ కన్పించాయి, కేసీఆర్‌లో అంతర్మథనం మెదలైంది, వలస పార్టీల్లో ఉండి తెలంగాన అస్థిత్వాన్ని కాపాడుకోలేం,

అప్పటికే జయశంకర్, కాళోజి, బియ్యాల జనార్ధన్ లాంటి ఎందరో నాయకులతో కలిసి తెలంగాణ వాస్తవ పరిస్థితుల విముక్తికై ఉద్యమించడానికి సంకల్పించాడు కేసీఆర్.

ఈ పోరులో సమిదలా కరిగిపోతాడో, జ్యోతిలా వెలిగిపోతాడో ఊహించని కేసీఆర్ మలిదశ పోరుకు పిడికిలి బిగించాడు. జై తెలంగాన అంటేనే కాల్చిచంపే ప్రభుత్వాలపై పంజా విసరడానికి పులిలా విజ్రుంబించాడు.

ఒక్కటిమాత్రం నిజం తెలంగాణ సాదించే వరకూ పోరుబాటలో ఉంటా, చచ్చైనా తెలంగాణను సాదించుకుంటా అనే

మెండిదైర్యంతో ఉద్యమానికి నాంది పలికాడు కేసీఆర్.

ఎప్రిల్ 27 2001

స్వరాష్ట్రం కోసం మెట్టమెదటి అడుగు

ఆత్మగౌరవం కోసం ఏకమైన గళాలు

జై  తెలంగాణ, జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ నినాదాలతో జలద్రుశ్యం మార్మోగిన రోజు

ఆ ఉద్య మ నినాదాల్లో టడీపీ ప్రాథమిక సబ్యత్వం, ఎమ్మెల్యే,  డిప్యూటి స్పీకర్, పదవులను కేసీఆర్ త్రుణప్యాయంగా త్యజించిన రోజు

తెలంగాణ వచ్చేంతవరకూ అలుపెరగకుండా పోరాడి తెలంగాణ సాదించిన టీఆర్ఎస్ పార్టీ ఆవిర్బవించిన రోజు

జైతెలంగాణ నినాదమే ఆత్మగౌరవంగా మలిచిన రోజు

తూటాల్లాంటి మాటలతో యుద్దానికి సిద్దమైన కేసీఆర్ ను చూసిన ప్రజల్లో స్వరాష్ట్రం కోసం మల్లీ ఆశ చిగురించింది. అప్పుడే ఉదయించిన స్వరాష్ట్ర కాంక్షను అణగదొక్కడానికి సీమాంద్ర నేతలు, మిడియా విఫల ప్రయత్నాలు మెదలపట్టాయి.

కేసీఆర్ అనర్ఘల వాగ్ధాటితో, అద్బుతమైన వాదనాపటిమతో అహింసే ఆయుదంగా చేసిన ప్రసంగాలు యావన్మందికి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను తేటతెల్లం చేసాయి.

 

2001 మే 17 కరీనగర్ వేదికగా టీఆర్ఎస్ చేసిన సింహగర్జన రాబోయే విజయానికి తొలి సంతకమైంది.

2001 జూన్ 1న మహబూబ్ నగర్, జూన్ 2న నల్గొండ, జూన్ 4న నిజామాబాద్, జూన్ 5న నిర్మల్, జూన్21న వరంగల్, నవంబర్17న ఖమ్మంలో నిర్వహించిన ప్రతీ భహిరంగ సభ జనాలతో పోటేత్తింది.

సభలకు హాజరైన లక్షలాది జనసందోహంతో పాటు యావత్ తెలంగాణ తమ ఉద్యమానికి సమర్థ నాయకత్వం దొరికిందని సంబుర పడింది.

2001 జూలై 12, 15, 17 తేదీలు తెలంగాణ ఆకాంక్షకై ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ మెట్టమెదటిసారిగా ప్రజాక్షేత్రంలో నిలబడి ఆంద్రా వలసవాద పార్టీలపై ఎన్నికల్లో విజయడంకా మోగించిన రోజులు.

స్థానిక సంస్థల్లో అత్యదిక స్థానాలతో పాటు కరీనంగర్, నిజామాబాద్ జడ్పీలను సైతం కైవసం చేసుకుంది టీఆర్ఎస్

ఇది చూసి ఓర్వలేని ఆంద్ర ప్రభుత్వం టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయమైన జలద్రుశ్యాన్ని నేలమట్టం చేసింది. వలసవాద పత్రికలలో విషప్రచారం మెదలుపెట్టింది, ఐనా అదరలేదు, బేదరలేదు పైపెచ్చు తెలంగాణ ఉద్యోగ అవకాశాల్లో దోపిడీని అరికట్టేందుకు 610 జీవో అమలు కోసం గిర్ గ్లానీ కమిసన్ ఏర్పడేలా గళమెత్తాడు.

2001 సెప్టెంబర్ 22న తాను త్యజించిన సిద్దిపేట్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి తెలంగాణ అస్థిత్వాన్ని చాటి శాసన సభలో టీఆర్ఎస్ మెదటి శాసన సభ్యుడయ్యాడు.

నాటి నుండి తానొక్కడే అసెంబ్లీలో తెలంగాణా వాదాన్ని ఉరకలెత్తించాడు, సాధికార నివేదికలతో వలస ప్రభుత్వానికి చెమటలు పట్టించాడు. కేసీఆర్ వాగ్దాటిని వినడానికే సీమాంద్ర సభ్యులు ఆసక్తిగా ఎదురుచూసేవారు

తెలంగాణ కోసం కేసీఆర్ జైతెలంగాణ అన్న ప్రతీ ఒక్కరినీ కలుపుకుపోయాడు. రాజకీయ పునరేకీకరణ చేసి ప్రజాస్వామ్య పద్దతుల్లో తెలంగాణ సాకారానికి కొత్తదారుల వేసాడు భావసారుప్యత కలిగిన వారిని ఏకతాటిపైకి తెచ్చాడు అలా 2002 ఆగష్టు పదకొండున తెలంగాణ సాదన సమితి టీఆర్ఎస్లో విలీనమైంది.

2002 నవంబర్ 25 నుండి 2003 జనవరి 6న భారీ సభ నిర్వహించే వరకూ జలసాధన ఉద్యమాన్ని ఉరకలెత్తించాడు,

2003 మార్చి 27న తెలంగాణ నలుమూలల నుండి తరలివచ్చిన అశేష జనసందోహం వెయ్యు కార్లతో చేసిన డిల్లీ యాత్ర జై తెలంగాణ నినాదాతో తొలిసారి తెలంగాణ ఉద్యమ సెగను చవిచూసింది దేశ రాజదాని.

ఎప్రిల్ 27 2003లో టీఆర్ఎస్ ద్వితీయవార్షికోత్సవ సభ వరంగల్‌లో పదిహేనులక్షల మందితో మాజీ ప్రదానులు, కేంద్ర మంత్రులు, వివిదరాష్ట్రాల ప్రతినిదులతో నభూతో నభవిష్యత్ అన్న రీతిలో నిర్వహించి దేశానికి తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను చాటిచప్పాడు కేసీఆర్,

2003 సెప్టెంబర్ 9న కొత్తరాష్ట్రాల కోసం ఏర్పడిన నేషనల్ ప్రంట్ కన్వినర్‌గా కేసీఆర్ నియమితులయ్యాడు.

జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ను సైతం జై తెలంగాణ అనిపించి తెలంగాణకు అనుకూలంగా మార్చాడు కేసీఆర్,

2004 టీఆర్ఎస్ తొలిసారి పాల్గొన్న సార్వత్రిక ఎన్నికలు – సమైక్య టీడీపీని కాంగ్రెస్‌తో కలిసి మట్టికరిపించి 5గురు ఎంపీల్ని, 26 మంది ఎమ్మెల్యేల్ని ఒంటిచేత్తో గెలిపించాడు. అసెంబ్లీలో టీఆర్ఎస్ హవా ఏంటో చూపించాడు.

తెలంగాణను నిరంతరం జ్వలింపచేయడానికి ప్రభుత్వంలో చేరింది టీఆర్ఎస్

దాని ఫలితమే 2005లో ఏర్పడిన ప్రణబ్ ముఖర్జీ కమిటీ, ఈ కమిటీకి దాదాపు 440 మంది ఎంపీల్ని తెలంగాణకు అనుకూలంగా నిలిచేలా చేసాడు కేసీఆర్.

2006 ఆగస్ఠు 24 తెలంగాణ ఇస్తానని మాట మార్చిన కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వ విద్రోహనికి నిరసనగా కేంద్ర మంత్రిపదవుల్ని త్యజించాడు కేసీఆర్, చారిత్రక జంతర్ మంతర్ వద్ద కేసీఆర్ నిరాహార దీక్ష చేసి యూపీఏపై ఒత్తిడి తీసుకొచ్చాడు.

2006 సెప్టెంబర్ 12న కరింనగర్ ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్లీ ప్రజల్లోకెళ్లాడు కేసీఆర్, నాటి ప్రభుత్వం విర్రవీగి నీ గెలుపే తెలంగాణకు రెఫరెండం అనడంతో సిద్దిపేటలో సమరశంఖారావం పూరించాడు. ఆఎన్నికల్లో 201582 ఓట్ల మెజార్టీతో విజయం సాదించి తెలంగాణ వాదాన్ని మరోక్కసారి మార్మోగించాడు. కరింనగర్ ఫలితం వైఎస్ చెంప చెల్లుమనిపించింది. కేసీఆర్‌ని ఓడించడానికి శాయశక్తులా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.

తెలంగాణ జిందాబాద్, టీఆర్ఎస్ జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్, ఈ గెలుపు తెలంగాణ వ్యాప్తంగా నూతనోత్తేజాన్ని నింపిన ఈ గెలుపుతో 2006 డిసెంబర్ 22న నల్గొండలో నిర్వహించిన తెలంగాణ ఆత్మగౌరవ సభ దద్దరిల్లింది.

తెలంగాణ కోసం 2008 మార్చిలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిదులంతా రాజీనామాలు చేసారు. ఉద్యమాన్ని ఎలాగైనా అణిచివేయాలనుకున్న ఆంద్ర నాయకత్వం తీవ్రంగా శ్రమించింది. మోసపు వాగ్దానాలతో, కుట్రలతో అదికార దుర్వినియోగం చేసింది. ఎన్నికల క్షేత్రంలో ఓడిపోయినా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించింది టీఆర్ఎస్.

2009 ఎన్నికల్లో అన్ని పార్టీలు తమ మానిఫెస్టోల్లో తెలంగాణ ఏర్పాటు అంశాన్ని చేర్చేలా గత్యంతరం లేని పరిస్థితుల్ని స్రుష్టించాడు కేసీఆర్. ఆంద్రాపార్టీ టీడీపీని సైతం తెలంగాణకు అనుకూలంగా మార్చి కలిసిపోటీ చేసింది టీఆర్ఎస్.

 

2009 అక్టోబర్ 9న రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని 14ఎఫ్ పై సుప్రీం తీర్పుతో హైదరాబాద్ ప్రీజోన్ అనడంతో తెలంగాణ అట్టుడికిపోయింది, 14 ఎఫ్ రద్దు, తెలంగాణ ఏర్పటే లక్ష్యంగా కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో అని చేసిన సింహనాదం డిల్లీవీదుల్ని వణికించింది.

సుధీర్ఘ ఉద్యమం వెన్నుపోట్లు ఎత్తుపల్లాలు, ఆటుపోట్లు, గెలుపు ఓటములు, దన ప్రళోబాలు, కభలించే కుట్రలు, కమ్మేసే రాజకీయాలు తెలంగాణ సాదనే ద్యేయంగా సాగతున్న కేసీఆర్‌ని ఇవేవి ఏం చేయలేకపోయాయి. ఓటమి ఎదురైన ప్రతీసారి రెట్టించిన ఉత్సాహంతో ముందుకురికాడు, వైపల్యం చెందిన ప్రతీసారీ వ్యూహాల్ని మార్చి పోరు చేశాడు. అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోలేదు, తెలంగాణ కోసం గొంగళి పురుగును ముద్దాడడానికీ వెనుకాడలేదు, కుట్రల్ని చూసి భగ్నమైన తెలంగాణ విద్యార్థులు ప్రాణత్యాగాలు చేస్తుంటే తల్లడిల్లాడు కేసీఆర్, ఏ ఒక్క తెలంగాన బిడ్డ ఆత్మార్ఫణం చేసుకోవద్దని తానే పార్టీ త్యాగానికి ప్రాణ త్యాగానికీ వెరవలేదు. అంతిమ లక్ష్యం కోసం తానే సమిదనవడానికి సిద్దమయ్యాడు.

నవంబర్ 29, 2009 సిద్దిపేటలోని రంగదాంపల్లిలో చారిత్రక ఆమరణ నిరాహార దీక్షకు సంకల్పించాడు కేసీఆర్. కరింనగర్ నుండి దీక్షాస్థలికి బయల్దేరిన కేసీఆర్‌ని ఆంద్రాప్రభుత్వం నిర్బందంలోకి తీసుకొని ఖమ్మం జైలుకు తరలించింది అంతే తెలంగాణా

సమాజం ఒక్కసారిగా తిరగబడింది. యావజ్జాతి ముక్తకంఠంతో ఈ ఘోరాన్ని ఖండించింది. అనంతరం నిమ్స్ కు తరలించారు

.

కేసీఆర్ నిరాహార దీక్ష – దశాభ్దాల పోరులో ప్రపంచ ఉద్యమాల గతిలో ఏ నాయకుడూ సాహసించని ప్రాణత్యాగానికి సిద్దపడ్డాడు కేసీఆర్. తెలంగాణ సమాజం మెత్తం కేసీఆర్ వైపు చూసింది. విద్యార్థులు, మెదావులు, ఉద్యోగులు, రైతులు, కవులు, కళాకారులు, కార్మికులు, మహిళలు, పిల్లలు, వ్రుద్దులు యవత్ సమాజం అతని వెంటే నడిచింది.

కేసీఆర్ ఆరోగ్యం క్షీణిస్తుండడంతో డిసెంబర్ 7 2009న నాటి ముఖ్యమంత్రి రోశయ్య నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి.

పన్నెండు రోజుల కేసీఆర్ నిరాహార దీక్ష కు కేంద్రం దిగివచ్చింది డిసెంబర్ 9న చారిత్రాత్మక నిర్ణయం వెలువరించింది. (చిదంబరం స్టేట్మెంట్)  రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని నాటి కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం ప్రకటించడంతో. చావునోట్లోకి వెల్లి తెలంగాణ సాదించిన కేసీఆర్ త్యాగం చరిత్రలో లిఖించింది తెలంగాణ.

సంబరాలు అంబరాన్నంటాయి. జై తెలంగాణ నినాదాలతో పిల్లాజెల్లా సందడి చేశారు, కానీ ఆ సంతోషం ఆవిరిచేసేలా సమైక్య కుట్రలు మెదలయ్యాయి.

డిసెంబర్ 23 న సీమాంద్ర కుట్రలతో ఆగిపోయిన తెలంగాణ ప్రక్రియను ఉరకలెత్తించేందుకు మరోసారి ప్రజలకు దైర్యం అందిచాడు కేసీఆర్.

14 పిబ్రవరి 2010న ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి లాక్కున్న కేంద్ర ప్రభుత్వంపై తిరుగుబాటు ఎగరవేశాడు, శ్రీక్రిష్ణ కమిటీ విదివిదానాలను విబేదిస్తూ మల్లీ రాజీనామాలు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు టీఆర్ఎస్ ప్రజాప్రతినిదులు.

చరిత్రలో కనివినీ ఎరగని పోరాట రూపాలకు అంకురార్పణ చేశాడు కేసీఆర్, మానవహారం, సాగరహారం, మిలియన్ మార్చ్, దూందాం, మేదోమదనాలు, రౌండ్ టేబుల్ కాన్పరెన్సులు, రోడ్డురోకో, రైల్ రోకో, రిలే నిరాహారదీక్షలు, వంటావార్పు, పూలతో నిరసనతెల్పడం, సమరదీక్ష, సడక్ బంద్, సంసద్ యాత్ర, చలో అసెంబ్లీ, సాగరహారం,  దేశ, విదేశాల్లోని తెలంగాణ బిడ్డల్ని సమన్వయ పర్చుకుంటూ అంతర్జాతీయ స్థాయిలో అన్లైన్లో ఉద్యమాన్ని తీసుకెళ్లడం ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు నిర్వహించడం, సకల జనుల్ని సమ్మెలోకి తీసుకువచ్చి ప్రపంచ చరిత్రలోనే సుధీర్ఘ సమ్మే 42 రోజుల పాటు నిర్వహించడం, సహాయనిరాకరణోద్యమం ఇలా 2010 నుండి అలుపెరగకుండా కాలుకి బలపం కట్టుకొని తెలంగాణ మెత్తం పర్యటించాడు కేసీఆర్.

ఈ పోరాటాలకు ఫలితంగా, కేసీఆర్ సమర నినాదానికి తుది రూపుగా తెలంగాణ ఆవిర్బావ ప్రక్రియ మల్లీ మెదలైంది.

జూలై 30 2013 తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన

అక్టోబర్ 4 2013 గ్రూప్ ఆఫ్ మినిష్టర్స్ కు కాంగ్రెస్ ఆంటోనీ కమిటీ హైదరాబాద్‌తో కూడిన తెలంగాన ఏర్పాటుకు అనుకూలంగా లేఖ

డిసెంబర్ 2 2013 తెలంగాణ ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినేట్ ఆమోదం

మర్చి 1 2014 న తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.

జూన్ 2 2014 తెలంగాణ ఏర్పడే వరకూ అప్రమత్తంగా ఉండి తెలంగాణ కోసం అలుపెరగని పోరాటం చేశాడు కేసీఆర్,

2014 ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాదించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. సుధీర్ఘ పోరాటంలో చూసిన తెలంగాణ అరిగోసలకు, వెనుకబాటుతనానికి నీళ్లు ఎంత ముఖ్యమో తెలుసు కనుక కాళేశ్వరంతో మహాయజ్ణాన్ని చేపట్టాడు. రికార్డు స్థాయిలో తన తొలి హయాంలోనే ప్రాజెక్టును పూర్తి చేసి దాదాపు ముప్పై రెండు లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేశాడు,

గొలుసుకట్టు చెరువులతో వైభవోపేతమైన కాకతీయుల వారసత్వాన్ని మిషన్ కాకతీయతో పునరుజ్జీవింపచేశాడు. గొంతు తడుపుకోడానికి గుక్కెడు నీళ్లు దొరక్క అల్లాడిన తెలంగాణ ఇండ్లలోకి మిషన్ భగీరథతో గంగమ్మను తెచ్చాడు. అడుగడుగునా అడుగంటుతున్న అభాగ్యులకు ఆసరా ఫించనై నిలిచాడు. గౌరవంగా మన ఇంటి బిడ్డను సాగనంపడానికి కళ్యాణ లక్ష్ముల కోసం షాదీ ముభారక్ ఇచ్చాడు. తెలంగాణ వస్తే అందకారం అలుముకుంటుందని ఏడ్చిన మెఖాలపై వేల విద్యుల్లతలతో మెరుపై మెరిసాడు, విద్యుత్ లోటుని అదిగమించి మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దాడు, వ్యవసాయానికి సర్వమై నిలిచి నిరంతర ఉచితకరెంటుతో పాటు పెట్టుబడి సాయం ఇస్తూ రైతు బందువైనాడు, కొండంత దీమాతో బీమానందించాడు. పరిశ్రమలకు నాణ్యమైన కరెంటుని ఇస్తూ ఉపాది అవకాశాలు పెంచాడు. ఇలా ప్రపంచమే అబ్బుర పడేలా అన్నిరంగాల్లో తెలంగాణ ప్రగతి సంతకం చేసాడు కేసీఆర్.

2018 డిసెంబర్లో మలి ఎన్నికల్లో కేసీఆర్ అభివ్రుద్ది ఎజెండాకు జనం బ్రహ్మరథం పట్టారు. రెండోసారి సీఎంగా కేసీఆర్ ప్రస్థానం మెదలయ్యింది.

గడిచిన దశాబ్ధాలు ఒక్కసారి చూసుకుంటే ఎట్లా ఉండే తెలంగాణా ఎట్లా పురోగమిస్తుందో అర్థమవుతుంది. ఎన్నెన్నో గోసల్ని చేదించుకుంటూ ఇక్కడ నిలబడ్డానికి తెలంగాణ ఎంత పోరాటం చేయవలసి వచ్చిందో అవగతమైతే కానీ కేసీఆర్ అంటే ఏంటో అర్థం కాదు, అర్థం లేని రాజకీయాలు, అసందర్భ ప్రేళాపనలు, అనాలోచిత నిర్ణయాలు ఏనాడు దరిచేరని ఆ మహోన్నత నేతలో మచ్చ వెతకడం అంటే చంద్రునిలో మచ్చను చూసి అవహేళన చేయడమే. అందుకే ఆ క్రుతఘ్నతకు తెలంగాణ ఎన్నడూ ప్రయత్నించదు. తెలంగాణమంతా నిండిన మహాత్ముడా తెలంగాణ జాతి సదా నీ వెంటే.

 

చరిత్రలో ఉండాలనకుంటారు అందరూ….

చరిత్రనే సృష్టిస్తారు ఇంకొందరు,

అరవై ఏళ్ల కళను సాకారం చేసిన

నువ్వే ఒక చరిత్ర

KCR – నువ్వే ఒక చరిత్ర    (written by BANDHOOK LAXMAN)