చైతన్య సమరాంగణ- దుర్గా మాధవి యాదవ్

చైతన్య సమరాంగణ- దుర్గా మాధవి యాదవ్ (ఏప్రిల్1,యమ్. బి.దుర్గా మాధవి యాదవ్ పుట్టిన రోజు)

ఆకాశంలో సగం అనంతకోటి నక్షత్రాల్లో సగం,అవని పై సగమైన మహిళలల భాగస్వామ్యం లేనిది ఏ సామాజిక చలన ఉద్యమాలు విజయవంతం కావు.ఆధిపత్యం, అణచివేత లను ఈ గడ్డ భరించదు అని నిరూపించడానికి సమ్మక్క సారక్కల నుండి ,ఇంటిని పోరాట కేంద్రంగా మార్చిన ఐలవ్వ మహోజ్వల చరిత మనకుంది. తెలంగాణ ప్రజల స్వేద సౌధం హైదరాబాద్ జాతీయోద్యమ,నిజాం గద్దె దించే ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది.సరోజినిదేవి, బ్రిజ్ రాణి ,పద్మజా నాయుడులు వంటి మహిళా మూర్తులు రాజకీయ,సాంఘిక సంస్కరణ,సేవా రంగాలలో అగ్రభాగాన ఉండి కృషి చేసారు.
పై మహిళా మూర్తుల వారసత్వ అపురూప సాంప్రదాయాన్ని కొనసాగించడానికి అన్నట్లుగా 1974 లో శివ ప్రసాద్ యాదవ్, నాగమణి యాదవ్ దంపతులకు దుర్గా మాధవి యాదవ్ జన్మించారు.
పాఠశాల దశ నుండి చదువులో,క్రీడా సాహిత్య కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ నాయకత్వ లక్షణాలను ప్రదర్శించేవారు.వ్యాపార శాస్త్రంలో పట్ల భద్ర విద్యను ఆంధ్ర మహిళా సభ కళాశాలలో చదివారు.జాతీయోద్యమములో ఆమోఘ కృషి చేసిన దుర్గాబాయి దేశముఖ్ దార్శనికతతో ఏర్పాటు చేసిన కళాశాలలో ఆ మహోన్నత నాయిక మణి పేరు లో దుర్గా ను జోడించుకోని దుర్గా మాధవి యాదవ్ గా సమాజం పట్ల సేవా నిరతితో తన ప్రస్థానం ప్రారంభించి ,మలి దశ తెలంగాణ ఉద్యమంలో మిలిటెన్సీ తత్వంతో పాల్గొన్నారు.

 

వాసవి సహకార బ్యాంకు లో సహాయ మేనేజర్ గా కొంతకాలం పని చేసిన దుర్గా మాధవి ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయి సామాజిక కార్యకర్తగా మారి తన ప్రస్తానంను కొనసాగిస్తున్నారు.ఉద్యమమే జీవితంగా, ఉద్యోగుల బాగోగులు పరమావధిగా కొనసాగుతున్న యమ్. బి కృష్ణయాదవ్ జీవన సహచరుడిగా లభించడంతో దుర్గా మాధవి యాదవ్ ఆకాశమే హద్దుగా సామాజిక సేవా కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు. ప్రతి వంటగత్తె రాజకీయ వేత్త కావాలి, అన్న లెనిన్,స్త్రీల ప్రగతి సమాజ ప్రగతికి నిజమైన కొలమానం అన్న అంబేద్కర్ వెలుగులో ప్రధాన స్రవంతి రాజకీయాల్లో ప్రవేశించారు.జి హెచ్ యమ్ సి పరిధిలోని నాచారము నాలుగవ వార్డు సభ్యురాలిగా పని చేశారు. ప్రజలను తన కుటుంబంగా భావించి ప్రజలకు సౌకర్యాల కల్పనలో ,బాగోగుల్లో ప్రత్యేక శ్రద్ధతో పని చేసి హృదయాలను చూరగొన్నారు.అంగన్ వాడి,డ్వాక్రా గ్రూపు ల సలహాదారు గా పని చేస్తూ వారి వారి సమస్యలను పరిష్కరింప చేస్తూ అభివృద్ధి మార్గాన పయనింప చేయడానికి తోడ్పడుతున్నారు.సామాజిక అస్తిత్వ ఉద్యమాల వెల్లువలో ఉత్పత్తి ప్రక్రియలో,శ్రమతో సంపద సృష్టించే తమ సామాజిక యాదవ సంఘం అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.ప్రస్తుతం మేడ్చల్ జిల్లా యాదవ సంఘ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.తమ అస్తిత్వ ఆత్మ గౌరవానికి .మూలమైన పండుగల,ఆచార సాంప్రదాయాలను,సంస్కృతుల పరిరక్షణలో, పోషణ లో పాల్గొంటున్నారు.

 

మలి దశ తెలంగాణ పోరాట కదన రంగంలో వెన్నుచూపని పోరాటస్ఫూర్తిని ప్రదర్శించారు.బాల్యంలోనే తల్లితండ్రుల నుండి 1969 ఉద్యమ కాలంలో నగర యువత త్యాగాల చరితను,ప్రజలు పడిన బాధలను తెలుసుకున్న మాధవి యాదవ్ నా తెలంగాణ నా ప్రజలు నినాద గర్జనలతో 2006 నుండి 2014 వరకు కేసీఆర్ ఇచ్చిన ప్రతి ఉద్యమ పిలుపును,కార్యక్రమాల విజయవంతం కోసం విశేష కృషి చేసారు. తెలంగాణ బతుకు కోల్పోయిన వైభవాలను తిరిగి ప్రతిష్ఠింప చేయాలనే తండ్లాట తో రాష్జ్త సాధన సమరంలో అలుపెరగని రీతిలో పని చేశారు.బస్తీ వాసులతో ,అంగన్ వాడిలతో,అనేక పొదుపు సంఘాలతో ఆయా సంఘాల నేతగా ఉండే అనుబంధంతో పెద్ద ఎత్తున మహిళలను తెలంగాణ ఉద్యమ సభలకు సమీకరించారు.గ్రేటర్ హైదరాబాద్ లో వంటా వార్పు,నిరాహార దీక్ష శిబిరాలను నిర్వహించారు.ఉద్యమకారులను తల్లిలా ఆదరించి ఆశ్రయాన్ని,భోజనాలను అందించారు. ఇంటిని ఉద్యమ కార్యాలయంగా మార్చి అనేక మేధో మదన శిబిరాలను నిర్వహించారు. నోమ సమావేశ మందిరంలో అనేక భారీ సదస్సుల ఆర్గనైజర్ గా పేరు పొందారు. సాగర హారం,మిలియన్ మార్చ్ లలో పోలీసు నిర్భందాలను లెక్క చేయకుండా బస్తి శ్రామిక మహిళలతో విజయవంతం చేసిన తీరు చరిత్ర నమోదు చేసుకుంది. ఈ ఉద్యమ క్రమంలోనే పేద ప్రజల తక్షణ బాగు కోసం,వీధి బాలల కోసము వైద్య శిబిరాలను, సేవా కార్యక్రమాలను నిర్వహించారు.టిజిఓ వ్యవస్థాపకుడు శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో ఉవ్వెత్తున ఉద్యోగులు ఉద్యమిస్తున్న కాలంలో తన సహచరుడు టిజిఓ హైదరాబాద్ జిల్లా నేత కృష్ణ యాదవ్ ముందు వరుసలో పూర్తి స్థాయి పొరాటకారుడిగా కొనసాగించిన ప్రస్థానానికి మాధవి గారు అందించిన సహకారము అపూర్వమైనది.ఈ ఉద్యమ ఆదర్శ జంట కేసీఆర్, కేటీఆర్,శ్రీనివాస్ గౌడ్ ల అభినందనలను అందుకున్నది.


విద్యార్థిగా,ఉద్యోగిగా,ఉద్యమకారిణి గా,సామాజిక కార్యకర్తగా తెలంగాణ రాష్ట్ర సాధనలో, ఇప్పుడు నవ నిర్మాణంలో మానవత్వం,సేవాభావం,నిజాయితీ,కార్యదీక్షత తోపని చేస్తూ ప్రజల సమస్యలను సానుభూతితో అర్ధం చేసుకుంటూ అధికారుల,ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే జీవన విధానాన్ని కొన సాగిస్తున్నారు.కాళోజి,జయశంకర్,కేసీఆర్ లను గౌరవించినట్టు అసమానరీతిలో పని చేసిన దుర్గా మాధవి యాదవ్ వంటి సామాన్య మహిళా మణులను గౌరవించే అద్వితీయ గుణాన్నీ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నది. ఈ శ్రేణిలో ముందు వరుసలో ఉండే దుర్గా మాధవి యాదవ్ కు ప్రభుత్వం సముచిత రీతిలో తన సేవలను పాలనలో ఉపయోగించుకోవాలి.

అల్లి మాధవిలత
సామాజిక కార్యకర్త