డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించిన రాష్ట్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో డిగ్రీ, పీజీ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా వేసినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి ప్రకటించారు. కరోనా కారణంగా అన్ని యూనివర్సిటీల పరిధిలోని పరీక్షలు వాయిదా వేశామని, పరీక్షలు రీ షెడ్యూల్‌ చేస్తామన్నారు.