తెలంగాణలో కరోనా కేసులు

తెలంగాణలో వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతోంది. గత 24 గంటల్లో 61,053 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 1,801 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. కోవిడ్ బాధితుల్లో 16 మంది మ‌ర‌ణించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 3,660 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు మొత్తం 5,37,522 మంది డిశ్చార్జ్ అయ్యారు.

తెలంగాణలో ప్రస్తుతం 35,042యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు 1,50,89,049 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్‌ బాధితుల్లో 3,263 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో కేసులు అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 390, రంగారెడ్డి 114, మేడ్చల్ 101, కరీంనగర్‌లో 92 కరోనా కేసులు నమోదయ్యాయి.