కాంట్రాక్ట్ పశువైద్యుల ఏడాది పొడ‌గింపుకి తెలంగాణ ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన వెటర్నరీ డాక్టర్ లు

మంత్రి త‌ల‌సానిని స‌న్మానించిన రాష్ట్ర కాంట్రాక్ట్ పశువైద్యుల సంఘము

కాంటాక్ట్ ప‌శు వైద్యుల కాలం మ‌రో సంవ‌త్స‌రం పాటు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం పొడ‌గించిన నేప‌థ్యంలో స‌ర్కారుకి వెట‌ర్న‌రీ డాక్ట‌ర్ల బృందం ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. ఈ మేర‌కు ఆ శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌కి డాక్ట‌ర్ శ్రీ‌ధ‌ర్ నేతృత్వంలోని ప‌శు వైద్యుల బృందం శుక్ర‌వారం ప్ర‌త్యేకంగా క‌లిసి థ్యాంక్స్ చెప్పింది. ఈ సంద‌ర్భంగా మంత్రిని శాలువా తో స‌న్మానించంది. తెలంగాణ రాష్ట్ర పరిధిలోని పశు సంవర్ధక శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు వెటర్నరీ డాక్టర్ల పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసిన విష‌యం విదిత‌మే.
ఒక వైపు యావ‌త్ దేశాన్ని మ‌హ‌మ్మారి కరోనా రోజురోజూకి విజృంభిస్తూ క‌బ‌ళిస్తున్న నేప‌థ్యంలో, మ‌రోవైపు క్షేత్ర‌స్థాయిలో విధుల నిర్వ‌హ‌ణ‌కి ఇబ్బందులు ఏర్ప‌డుతున్నా స‌రైన విధులు నిర్వ‌ర్తిస్తున్న‌వారికి ప్ర‌భుత్వం న్యాయం చేసింద‌ని డాక్ట‌ర్ కాటం శ్రీ‌ద‌ర్ పేర్కొన్నారు.
తెలంగాణ ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డంపై ఆయ‌న‌ హ‌ర్షం వ్య‌క్తం చేశారు.
రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్ద మ‌న‌సుతో ప‌శు వైద్యుల ప‌ట్ల మాన‌వీయ‌త‌ని ప్ర‌ద‌ర్శించ‌డం సంతోషించ‌ద‌గ్గ అంశ‌మ‌న్నారు.
ఈ నిర్ణ‌యంతో సుమారు 75 మంది ప‌శు వైద్యులు గ్రౌండ్ లెవ‌ల్‌లో నిత్యం శ్రమించే డాక్ట‌ర్ల‌కి ప్ర‌త్యేక అవ‌కాశం ల‌భించినట్టు ఆయ‌న చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్ర‌భుత్వ అద్భుత‌ స్పంద‌నకి అనుకూలంగా క్షేత్ర‌స్థాయిలో ప‌శు వైద్యులు మ‌రింత రెట్టించిన ఉత్సాహంతో రానున్న రోజుల్లో ప‌ని చేసి స‌ర్కారుకి మంచి పేరు వ‌చ్చే విధంగా సేవ‌లు అందిస్తామ‌ని మంత్రి ని కలిసి హామీనిచ్చారు. పశుసంవర్ధక శాఖలో పని చేస్తున్న 75 మంది వెటర్నరీ డాక్టర్ ల మరో ఏడాది పొడిగింపుకు షాక్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఎంతో చొరవ తీసుకొని రెన్యూవల్ చేయించరన్నారు.
ఇందుకు ప్రతి ఒక్క వెటర్నరీ డాక్టర్ ల కుటుంబం మంత్రి తలసాని గారికి ఋణపడి పడి ఉంటామన్నారు.
*పశుభవన్ లో ఆర్డర్ కాపీలు అందజేత :*
75 మంది కాంట్రాక్ట్ వెటర్నరీ డాక్టర్ లకు సంబంధించిన తెలంగాణ రాష్ట్ర గొర్రెల, మేకల అభివృద్ధి సంస్థ, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రామ్ చందర్ నాయక్ గారి చేతుల మీదుగా పోస్టింగ్ ఆర్డర్స్ అందజేశారు.
ఈ కార్యక్రమంలోరాష్ట్ర కాంట్రాక్టు వెటర్నరీ డాక్టర్ల సంఘము నాయకులు అనిల్ రెడ్డి, రాజేందర్ యాదవ్, భానుకిరణ్ నాయక్,శివ,రోహిణి తదితరులు పాల్గొన్నారు.