ముఖ్య”మంత్రి” కేటీఆర్ టీంలో వీరికి ఛాన్స్?

హైదరాబాద్,తీస్మార్ న్యూస్:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీ.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు బాధ్యతలు స్వీకరించబోతున్నారని వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఆయన క్యాబినెట్ లో కొన్ని మార్పులు చేసి కొత్త వారికి అవాకాశం ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది.ఖమ్మం జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కీలక పదవులు ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.మంత్రులు హరీష్ రావు,ఈటల రాజేందర్ లకి పార్టీ కీలక బాధ్యతలు అప్పగించి ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు వినికిడి.ఈ వార్తల్లో ఎంత నిజం దాగి ఉందో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.