బ‌డ్జెట్ స‌మావేశాల‌పై నేడు ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మీక్ష‌!

హైద‌రాబాద్ : తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇవాళ స‌మీక్ష నిర్వ‌హించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ స‌మావేశానికి ఆర్థిక మంత్రి హ‌రీష్ రావుతో పాటు ఆర్థిక శాఖ అధికారులు హాజ‌రు కానున్న‌ట్లు తెలుస్తోంది. బ‌డ్జెట్ స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌తో పాటు సంబంధిత అంశాల‌పై సీఎం స‌మీక్షించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ సంద‌ర్భంగా బ‌డ్జెట్ స‌మావేశాల తేదీల‌ను ఖ‌రారు చేసే అవ‌కాశం ఉంది. మ‌రో రెండు వారాల్లో బ‌డ్జెట్ స‌మావేశాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.