రెండు, మూడు రోజుల్లో పీఆర్సీ ప్ర‌క‌టిస్తాం : సీఎం కేసీఆర్‌

హైద‌రాబాద్ : రాష్ర్ట ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుభ‌వార్త వినిపించారు. ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి గవ‌ర్నర్ చేసిన‌‌ ప్రసం‌గా‌నికి ధన్య‌వా‌దాలు తెలిపే తీర్మా‌నంపై చ‌ర్చ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. శాస‌న‌స‌భ వేదికగా రెండు, మూడు రోజుల్లోనే గౌర‌వ‌ప్ర‌ద‌మైన పీఆర్సీ ప్ర‌క‌టిస్తామ‌ని సీఎం చెప్పారు. ఉద్యోగుల మీద త‌మ‌కెంత ప్రేమ ఉందో గ‌త పీఆర్సీతోనే చూపించామ‌న్నారు. మా ఉద్యోగులు కాల‌ర్ ఎత్తుకుని ఇండియాలో తాము అత్య‌ధిక‌ జీతాలు పొందుతామ‌ని చెప్పుకునే విధంగా జీతాలు ఇస్తామ‌ని చెప్పాం.. దాన్ని అమ‌లు చేస్తున్నాం.. తాను ప్ర‌క‌టించిన త‌ర్వాత ఉద్యోగులు త‌ప్ప‌కుండా హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ముగిసిన నేప‌థ్యంలో పీఆర్సీ ప్ర‌క‌టిస్తామ‌న్నారు.