రాష్ర్టంలో వందకు 100 శాతం రుణమాఫీ

రాష్ర్టంలోని రైతులకు రుణమాఫీ వందకు 100 శాతం చేసి తీరుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.గవర్నర్లు కేబినెట్ అఫ్రూవ్ చేసిన ప్రసంగాన్ని చదువుతారు. మేం చేసింది పెద్దది కాబట్టి.. బుక్ పెద్దగా ఉంటుంది. మేం చేసింది చాలా ఉంది కాబట్టి.. ప్రసంగం ఎక్కువే ఉంటుంది. మేం చేసిన దాంట్లో మేం చెప్పింది చాలా తక్కువ అని తెలిపారు.ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. 25 వేల వరకు ఎంత మందికి రుణాలు ఉండేనో… వారికి గత సంవత్సరం మాఫీ చేశాం. మిగతా వారి విషయంలో రేపు ఆర్థిక మంత్రి ప్రకటన చేస్తారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో రుణమాఫీ చేయలేదు.పోడు భూముల విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. 60 ఏండ్ల పాపాన్ని సమగ్రంగా పరిశీలించి పరిష్కరించుకుంటాం. పోడు భూముల విషయంలో పీఠముడి ఉందన్నారు.కాంగ్రెస్ హయాంలో నీటి తిరువా ముక్కుపిండి వసూలు చేశారు. తెలంగాణ రాష్ర్టంలో నీటి తిరువాను ఎత్తేశామన్నారు. ఉచిత కరెంట్‌ను రాజశేఖర్ రెడ్డి ప్రకటించారు. కానీ కరెంట్ వచ్చేది కాదు.. ఉత్త కరెంట్ కిందనే పోయేది. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాష్ర్టంలో ఉచిత 24 గంటల నాణ్యమైన కరెంట్‌ను అందిస్తున్నామని తెలిపారు. హై క్వాలిటీ పవర్ సప్లయి అవుతోంది. వరద కాల్వ మీద వందల, వేల మోటార్లను పెట్టుకునే వారు. కాకతీయ కాల్వ మీద కూడా వేల మోటార్లు పెట్టుకున్నప్పటికీ.. వాటి వద్దకు వెల్లొద్దని కరెంట్ అధికారులకు తాను సూచించానని చెప్పారు. రైతుల విషయంలో చాలా లిబరల్‌గా ఉన్నామని చెప్పారు. యాసంగిలో 52 లక్షల ఎకరాల సాగు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి ప్రసంగం విషయంలో చాలా విషయాలు వస్తాయన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీకి నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నాడు 128 ఎకరాల్లో పాలీ హౌజ్‌లు ఉంటే.. ఇప్పుడు 1300 ఎకరాల్లో ఉన్నాయి. సబ్సిడి కూడా 75శాతం ఇస్తున్నాం. 6 లక్షల ఎకరాలకు డ్రిప్ పరికరాలు పంపిణీ చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ పథకాల భ్రమల నుంచి భట్టి బయటకు రావాలని సీఎం కేసీఆర్ సూచించారు.