నేడు శాసనసభలో బడ్జెట్‌ పద్దులపై చర్చ

హైదరాబాద్‌: అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఏడో రోజైన నేడు.. బడ్జెట్‌ పద్దులపై శాసనసభలో చర్చించనున్నారు. ఇవాళ విద్యాశాఖ, వైద్య ఆరోగ్య, పాఠశాల, సాంకేతిక, ఉన్నతవిద్య సహా వివిధ శాఖల పద్దులకు సంబంధించిన అంశాలు చర్చకురానున్నాయి. అదేవిధంగా క్రీడలు, కార్మిక, దేవాదాయ, అటవీశాఖ, పర్యాటక, ప్రభుత్వరంగ సంస్థలు, ఐటీ పరిశ్రమల శాఖల పద్దుల గురించి చర్చిస్తారు.
దీంతోపాటు ప్రశ్నోత్తరాల్లో వ్యవసాయ యాంత్రీకరణ, బస్తీ దవాఖానాలపై, గిరిజన ఉపప్రణాళిక, శ్మశాన వాటికలు, డంపింగ్‌యార్డుల నిర్మాణం, పామాయిల్‌ సాగుపై చర్చించనున్నారు. మంత్రి హరీశ్‌ రావు గత గురువారం అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.