కేసీఆర్ జన్మదినం సంధర్భంగా అభిమానాన్ని చాటిన ఆంధ్ర రైతు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టిన రోజును పురస్కరించుకొని తూర్పు గోదావరి జిల్లా కడియం పల్ల వెంకన్న నర్సరీ నిర్వాహకులు వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా వాసులు పల్ల సత్తిబాబు, పల్ల సుబ్రహ్మణ్యం, పల్ల గణపతి రంగురంగుల పూలు, పూలమొక్కలతో కెసిఆర్ చిత్రపటాన్ని సృజనాత్మకంగా తీర్చిదిద్ది జన్మదిన శుభాకంక్షలు తెలిపారు

తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు కెసిఆర్ ప్రారంభించిన హరితహారం కార్యక్రమంతో ప్రేరణ పొంది తాము ఈ విధంగా వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపామని వారు తెలిపారు. తెలంగాణేతర ప్రజలు ఈ విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం పలువురిని ఆకర్షించింది