‘ఆర్ఆర్ఆర్’తో  తెలంగాణ అభివృద్ధికి కొత్త ఊపు:ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు

హైద‌రాబాద్ : తెలంగాణ‌కు మ‌రో మ‌ణిహారం RRR అని ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు అన్నారు. ఈ రిజీన‌ల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) నిర్మాణం తెలంగాణ అభివృద్ధికి కొత్త ఊపును ఇస్తుంద‌న్నారు. న‌గ‌రంలో ట్రాఫిక్ ర‌ద్దీని త‌గ్గించ‌డంతో పాటు జిల్లాల నుంచి హైద‌రాబాద్‌కు మెరుగైన ర‌వాణా సౌక‌ర్యం కోసం రీజిన‌ల్ రింగ్ రోడ్డును ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించింద‌ని తెలిపారు. ప్ర‌స్తుత‌మున్న ఔట‌ర్ రింగ్ రోడ్డుకు 30 కిలోమీట‌ర్ల అవ‌త‌ల‌, 348 కి.మీ. పొడ‌వున ఆర్ఆర్ఆర్ నిర్మాణం కానుంద‌ని చెప్పారు. రీజిన‌ల్ రింగ్ రోడ్డుకు అవ‌స‌ర‌మైన భూసేక‌ర‌ణ‌కు రాష్ర్ట ప్ర‌భుత్వం ఈ బ‌డ్జెట్‌లో 750 కోట్ల‌ను ప్ర‌తిపాదిస్తున్న‌ట్లు మంత్రి హ‌రీష్ రావు వెల్ల‌డించారు.

రాష్ర్టంలో పౌర విమాన‌యానాన్ని అభివృద్ధి చేయాల‌న్న త‌లంపుతో రాష్ర్టంలోని ద్వితీయ శ్రేణి న‌గ‌రాల్లో ఎయిర్‌స్ర్టిప్‌ల నిర్మాణాన్ని ప్ర‌భుత్వం త‌ల‌పెట్టింది. ఇందుకోసం రూ. 100 కోట్ల నిధుల‌ను ప్ర‌తిపాదిస్తున్న‌ట్లు మంత్రి పేర్కొన్నారు.