రాష్ట్రవ్యాప్తంగా 60 శాతం విద్యార్థులు స్కూళ్లకు హాజరయ్యారు:సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణలో సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రవ్యాప్తంగా 60 శాతం విద్యార్థులు స్కూళ్లకు హాజరయ్యారన్నారు. 2, 3 రోజుల్లో 100 శాతం విద్యార్థులు స్కూళ్లకు హాజరవుతారని మంత్రి తెలిపారు. క్లాసులకు రాని విద్యార్థులకు సైతం ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహిస్తారని చెప్పారు. 70శాతం సిలబస్ ప్రకారమే మూడు నెలలు తరగతులు కొనసాగుతాయన్నారు. కింది స్థాయి తరగతులు ప్రారంభించే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.