52 మంది ఎలిమినేట్‌.. ఆధిక్యంలో “ప‌ల్లా”

న‌ల్ల‌గొండ : వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ‌ ముందంజలో ఉంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏ అభ్యర్థికి 50 శాతం ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును చేపట్టిన సంగ‌తి తెలిసిందే. ఇప్పటివరకు 52 మంది అభ్యర్థుల ఎలిమినేషన్‌ ప్రక్రియ పూర్తయింది. ఎలిమినేషన్‌ అభ్యర్థుల ఓట్లు మిగతా అభ్యర్థులకు జమ చేస్తున్నారు. ఇందులో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 316, తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు 296, ప్రొ.కోదండ‌రాంకు 333 ఓట్లు జ‌మ అయ్యాయి. తొలి ప్రాధాన్యం +రెండో ప్రాధాన్యంతో కలిపి పల్లాకు 1,10,840+316=1,11,156. తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు 83,290+296= 83,586. ప్రొ. కోదండరాంకు 70,072+333=70405 ఓట్లు పోల‌య్యాయి. అభ్యర్థి విజయం సాధించాలంటే 1,83,167 ఓట్లు అవసరం.