రాష్ట్రంలో కొత్తగా 2,478 కరోనా కేసులు

హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇటీవల వరుసగా రోజు వారీ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2,478 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. మహమ్మారి బారినపడి మరో ఐదుగురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. తాజాగా 363 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 15వేలు దాటింది. ప్రస్తుతం 15,472 క్రియాశీల కేసులున్నాయని, 9,674 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తాజాగా నమోదైన కేసుల్లో 402 హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసులు 3.21 లక్షలకు చేరగా.. ఇప్పటి వరకు 3.03లక్షల మంది కోలుకున్నారు. మరో 1,746 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు.