తెలంగాణలో కొత్తగా 2 వేల కరోనా కేసులు

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా రోజువారీ కేసులు 2 వేలు దాటాయి. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం సాయంత్రం 8 గంటల వరకు కొత్తగా 2055 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 303 మంది బాధితులు మహమ్మారి బారినుంచి కోలుకున్నారు. మరో ఏడుగురు మృతిచెందారు. దీంతో మొత్తం కరోనా కేసులు 3,18,704కు చేరాయి. ఇందులో 1741 మంది మరణించగా, 3.03 లక్షల మంది బాధితులు కోలుకున్నారు. రోజువారీ కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్‌ కేసులు కూడా అధికమవుతున్నాయి. మొత్తం కేసుల్లో ప్రస్తుతం 13,362 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 8263 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.

కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 398, మేడ్చల్‌ జిల్లాలో 214, రంగారెడ్డిలో 174, నిజామాబాద్‌లో 169 చొప్పున ఉన్నాయి. కాగా, నిన్న రాష్ట్రవ్యాప్తంగా 87,332 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.