మార్చిలోపు సిద్ధం కానున్న టీహబ్-2

హైదరాబాద్,తీస్మార్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన టీ హబ్-2 నిర్మాణ పనులు మార్చి లోపు పూర్తికానున్నాయి.3.12 ఎకరాల్లో 3.72 లక్షల చ.అడుగుల్లో ఏర్పాటు చేయబడుతున్న ఈ నిర్మాణం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ కానుంది.రూ.276 కోట్లతో నిర్మిస్తున్న టీ హబ్-2 వల్ల 1000 స్టార్టప్‌లకు అవకాశం దొరకనుంది.