హైదరాబాద్:రానున్న మూడు రోజులు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది.తెలంగాణలోని 16 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ,హైదరాబాద్ కి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసి, జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించింది.ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని పలు గ్రామాలకు పూర్తిగా రాకపోకలు బంద్ అయ్యాయి.అల్పపీడనంతో రెండు రాష్ట్రాల్లోను ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
Tag: telangana
తెలంగాణలో మే 1 వరకు నైట్ కర్ఫ్యూ
హైదరాబాద్ : కరోనా మహమ్మారి ఉధృతి దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి మే 1వ తేదీ ఉదయం 5 గంటల వరకు రాష్ర్టంలో రాత్రి కర్ఫ్యూ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్ఫ్యూ నుంచి అత్యవసర సర్వీసులు, పెట్రోల్ బంక్‌లు, మీడియాకు మినహాయింపు ఇచ్చారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. నిబంధనలు ఉల్లంఘించిన...
రాష్ట్రంలో కొత్తగా 2,478 కరోనా కేసులు
హైదరాబాద్ : తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇటీవల వరుసగా రోజు వారీ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2,478 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. మహమ్మారి బారినపడి మరో ఐదుగురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. తాజాగా 363 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 15వేలు దాటింది. ప్రస్తుతం 15,472 క్రియాశీల కేసులున్నాయని, 9,674 మంది బాధితులు...
కరోనా కట్టడికి ప్రజలు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండండి : సీఎం కేసీఆర్
దేశవ్యాప్తంగా కరోనా తిరిగి వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో, ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ మాస్కులు ధరించి సునిశిత జాగ్రత్తలు పాటించాలని, కరోనా కట్టడికోసం ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలను కోరారు. మన రాష్ట్రంలో ముఖ్యంగా జనం రద్దీగా వుండే ప్రాంతాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ప్రజలతో పాటు కార్పోరేషన్లు, మున్సిపాలిటీల ప్రజలు కరోనా పట్ల మరింత అప్రమత్తతతో మెలగాలని సీఎం సూచించారు. ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడి...
తెలంగాణలో కొత్తగా 2 వేల కరోనా కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా రోజువారీ కేసులు 2 వేలు దాటాయి. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం సాయంత్రం 8 గంటల వరకు కొత్తగా 2055 పాజిటివ్ కేసులు నమోదవగా, 303 మంది బాధితులు మహమ్మారి బారినుంచి కోలుకున్నారు. మరో ఏడుగురు మృతిచెందారు. దీంతో మొత్తం కరోనా కేసులు 3,18,704కు చేరాయి. ఇందులో 1741 మంది మరణించగా, 3.03 లక్షల మంది బాధితులు కోలుకున్నారు. రోజువారీ కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులు కూడా అధికమవుతున్నాయి....
సాహసం చేసి… సారును చూద్దామని వచ్చా..
అభిమానం ఎంతటి సాహసానికైనా పురికొల్పుతుందనడానికి ఉదాహరణ ఈ చిత్రం. 30 అడుగుల ఎత్తున్న కట్టపై నుంచి సన్నని పైపు సాయంతో జరజరా జారుతున్న ఈ మహిళ పేరు మంగమ్మ. ఊరు వర్గల్ మండలం రామక్కపేట. అప్పటివరకు పొలంలో పనిచేసుకుంటున్న ఆమెకు సీఎం మరికాసేపట్లో హల్దీవాగులోకి గోదావరి జలాలు విడుదల చేసేందుకు వస్తారని తెలిసింది. అంతే…అవతలి కట్ట మీద నుంచి సన్నని పైపు సాయంతో కాలవలోకి దిగింది. అక్కడి నుంచి చదునుగా ఉన్న మార్గం మీదుగా వేదికవైపు పరుగులు...
తెలంగాణ లో కొత్తగా 1,914 కరోనా కేసులు నమోదు
హైదరాబాద్: రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసులు 2 వేలకు చేరవలో నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,914 పాజిటివ్ కేసులు నమోదవగా, మరో ఐదుగురు మరణించారు. మహమ్మారి బారినుంచి 285 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,16,649కి చేరాయి. ఇందులో 1734 మంది కరోనాతో మృతిచెందారు. మరో 3.03 లక్షల మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల్లో 11,617 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 6634 మంది హోం...
హల్దీ, గజ్వేల్ కాల్వలోకి కాళేశ్వర జలాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్
సంగారెడ్డి : కాళేశ్వర ప్రాజెక్టు ప్రస్థానంలో మంగళవారం మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కాల్వలో పారుతున్న కాళేశ్వర జలాలను.. వర్గల్ మండలం అవుసులపల్లి గ్రామంలో సంగారెడ్డి కెనాల్ నుంచి హల్దీ కాల్వలోకి కాళేశ్వర జలాలను విడుదల చేశారు. హల్దీ కాల్వలోకి 1600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అనంతరం మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో కాళేశ్వర జలాలను గజ్వేల్ కాల్వలోకి విడుదల చేశారు. నీటి విడుదల సందర్భంగా గోదావరి జలాలకు సీఎం...
రాష్ట్రంలో కొత్తగా 1,498 కరోనా కేసులు
హైదరాబాద్ : తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గత కొద్ది రోజులు రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ వైరస్ వ్యాప్తి చెందుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మరో 1,498 కొవిడ్ కేసులు రికార్డయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. వైరస్ ప్రభావంతో మరో ఆరుగురు మృత్యువాతపడ్డారు. కొత్తగా 245 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. ఇవాళ నమోదైన కేసులతో క్రియాశీల కేసులు 10వేలకు...
లాక్‌డౌన్ వద్దంటే.. మాస్క్ తప్పనిసరి
కరోనా వైరస్ నిర్మూలన మన అందరి బాధ్యత మంత్రి కే తారకరామారావు కూకట్‌పల్లిలో పలు అభివృద్ధి పనుల ప్రారంభం లాక్‌డౌన్ వద్దంటే.. మాస్క్ తప్పనిసరి రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్ రావొద్దంటే అందరూ తప్పనిసరిగా మాస్కు లు ధరించాలని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ సోకకుండా ప్రజలంతా జాగ్రత్తంగా ఉండాలని సూచించారు. ఇండ్ల నుంచి బయటకు రావాలంటే విధిగా మాస్క్ ధరించాలని చెప్పారు. కరోనా నిర్మూలన కోసం...