ముంబై: ఒకప్పటి బాలీవుడ్ బాద్ షా, దివంగత రాజ్‌కపూర్ తనయుడు, ప్రముఖ నటుడు రాజీవ్‌కపూర్ (58) ఇకలేరు. ఈ విషయాన్ని రాజీవ్ కపూర్ కుటుంబసభ్యురాలు నీతూ కపూర్ వెల్లడించారు. ఈ మేరకు నీతూ కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాజీవ్‌కపూర్ ఫొటోను షేర్‌చేశారు. దానికింద రిప్ అని కామెంట్ పెట్టారు. అయితే, రాజీవ్ కపూర్ మరణానికిగల కారణాలను ఆమె వెల్లడించలేదు. దివంగత రిషి కపూర్, రణదీర్ కపూర్‌లు రాజీవ్ కపూర్ సోదరులు. రాజీవ్ కపూర్ తన కెరీలో రామ్ తేరీ...
Tag: National news
రేపు అర్ధరాత్రి వరకు ఇంటర్నెట్ సేవలు బంద్
న్యూఢిల్లీ: ఢిల్లీ సరిహద్దుల్లో ఇంటర్నెట్ సర్వీసులపై సస్పెన్షన్‌ను రేపు రాత్రి 11 గంటల వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలైన సింఘు, ఘాజీపూర్, టిక్రిల్లో సస్పెన్షన్ కొనసాగుతుందని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత రెండు నెలల నుంచి ఆందోళన చేస్తున్న రైతులు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సందర్భంగా...
స్నేహితుడి ప్రియురాలితో సంబంధం…హత్య
ముంబై: మహారాష్ట్రలో అమీర్ హాసన్ (19) అనే వ్యక్తి తన స్నేహితుడైన జుబేర్ హసన్ ఖాన్ (24) చేతిలో దారుణహత్యకు గురయ్యాడు. అమీర్ హాసన్ తన ప్రియురాలితో సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో జుబేర్ ఖాన్ అతడిని దారుణంగా హత్య చేశాడు. నవీ ముంబైలోని షిల్ ఫాటా ఏరియాలో ఈ నెల 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముంబైలోని చెంబూర్ ఏరియాలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.....
నటుడు అరవింద్ జోషి కన్నుమూత
ముంబై: పాతతరం నటుడు, ప్రముఖ గుజరాతీ నటుడు శర్మాన్ జోషి తండ్రి అరవింద్ జోషి (84) ఇకలేరు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో వారం రోజుల క్రితం ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేర్పించారు. వారం రోజులుగా అక్కడే చికిత్స పొందుతున్న జోషి ఈ ఉదయం కన్నుమూశారు. అరవింద్ జోషి మరదలు సరితా జోషి ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. అరవింద్ జోషికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. అరవింద్...
ప్రముఖ గాయకుడు నరేంద్ర చంచల్ కన్నుమూత
న్యూఢిల్లీ: ప్రముఖ గాయకుడు నరేంద్ర చంచల్ (80) కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. పంజాబ్‌లో జన్మించిన నరేంద్ర చంచల్.. ‘భజన్ కింగ్’గా గుర్తింపు సాధించారు. ఆధ్యాత్మిక భజనలతోపాటు పలు హిందీ పాటలు ఆలపించిన ఆయన బాబి సినిమాలోని ‘బేషక్ మందిర్ మసీద్’ పాటకు గానూ ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్నారు. నరేంద్ర చంచల్ మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తంచేశారు. తన...
డబ్బు డ్రా చేసేందుకు బ్యాంకుకు వెళ్లిన శవం…
బీహార్ రాజధాని పట్నా సిటీలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. షాజహాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిగ్రియవాన్ గ్రామానికి చెందిన మహేశ్ (55) అనే వ్యక్తి అనారోగ్యంతో చనిపోగా.. అతని శవం తన అంత్యక్రియలకు డబ్బులు డ్రా చేయడం కోసం బ్యాంకుకు వెళ్లింది. శవం బ్యాంకుకు వెళ్లడం ఏమిటి అనుకుంటున్నారా..? కానీ నిజంగానే వెళ్లింది! అయితే తనకు తానుగా కాదులెండి.. గ్రామస్తులు తీసుకెళ్తే వెళ్లింది. మరి ఇంతకూ ఏం జరిగిందో తెలుసుకుందామా..?అనారోగ్యంతో మరణించిన మహేశ్‌కు తల్లిదండ్రలు ఎప్పుడో...
చిరుతను బోల్తా కొట్టించిన జింక
హైదరాబాద్: చిరుత అత్యంత వేగంగా పరుగెత్తగలదు. అందుకే ఆహారం కోసం ఏ జంతువునైనా టార్గెట్ చేస్తే దాన్ని ఈజీగా వేటాడగలదు. కానీ, తను టార్గెట్ చేసిన జంతువు తెలివైనదైతే వేగం ఎందుకూ పనికిరాదని ఓ చిరుతకు తెలిసొచ్చింది. ఓ జింకను టార్గెట్ చేసిన చిరుత దానిపైకి వేగంగా దూసుకొచ్చింది. కానీ జింక తెలివిగా వ్యవహరించింది. చిరుత బారి నుంచి తప్పించుకునేందుకు ఒకవైపు పరుగు తీయబోయిన జింక.. ఆ వెంటనే డైరెక్షన్ మార్చుకుని వెనక్కి పరుగెత్తడం ద్వారా చిరుతను...
నిర్లక్ష్యం
ముంబై: చావుకు, బతుకుకు మధ్య క్షణమే తేడా అంటే ఇదేనేమో..! ఓ వృద్ధుడు రైల్వేస్టేషన్‌లోని ఒక ప్లాట్‌ఫామ్ నుంచి మరో ప్లాట్‌ఫామ్‌కు రైలు పట్టాల మీదుగా దాటబోయి రెప్పపాటులో ప్రమాదం తప్పించుకున్నాడు. ఒక్క క్షణం ఆలస్యమైనా అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. సమయానికి అక్కడున్న రైల్వే కానిస్టేబుల్ చాకచక్యంగా వ్యవహరించడం సదరు వృద్ధుడు ప్రాణాలతో బయటపడటానికి దోహదపడింది.మహారాష్ట్ర రాజధాని ముంబైలోని దహిసార్ రైల్వేస్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ 60 ఏండ్ల వృద్ధుడు దహిసార్ రైల్వేస్టేషన్‌లోని ఒక...
సీబీఎస్ఈ-2021 పరీక్షల షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ)-2021 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలు మే 4 నుంచి జూన్ 10 వరకు కొనసాగనున్నాయి. జూలై 15న పరీక్షల ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ మీడియాకు వెల్లడించారు. విద్యార్థులు ఏయే పరీక్షలను ఏయే తేదీల్లో నిర్వహిస్తారనే వివరాల కోసం సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవాలని ఆయన సూచించారు. డిసెంబర్ 31న సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్‌ను...
కసాయి తండ్రి
లక్నో: నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఉత్తరప్రదేశ్‌లో మరో హృదయవిధారకమైన ఘటన చోటుచేసుకుంది. ఓ తాగుబోతు తండ్రి తన రెండు నెలల కొడుకును కర్రతో కొట్టిచంపాడు. అప్పటిదాకా తల్లి ఒడిలో ఆడుకుంటున్న ఆ చిన్నారి తండ్రి కొట్టిన బలమైన దెబ్బకు అక్కడికక్కడే విగతజీవిగా మారాడు. కన్న కొడుకు తన కళ్లముందే విలవిల్లాడుతూ ప్రాణాలు విడువడం చూసి ఆ తల్లి మనసు తల్లడిల్లింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షామ్లీ జిల్లాలోని తానా భవన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం...