కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న, గుర్తింపు పొందిన ప్రయివేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి నెలకు రూ. 2000 ఆపత్కాల ఆర్ధిక సాయంతో పాటు కుటుంబానికి 25 కేజీల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది తమ బ్యాంకు అకౌంటు, వివరాలతో స్థానిక జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుందని సీఎం...
Tag: ktr
నర్సంపేట ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు త్వరలోనే భూసేకరణ
హైదరాబాద్ : శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా నర్సంపేటలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కేటీఆర్ సమాధానం ఇచ్చారు. సంబంధిత జిల్లా కలెక్టర్ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు కోసం భూములను గుర్తించారు. ఫుడ్ పార్క్ కోసం వరంగల్ గ్రామీణ జిల్లాలోని నర్సంపేట గ్రామంలోని సర్వే నంబర్ 813లోని ప్రభుత్వ అసైన్డ్ భూమికి సంబంధించి 46 ఎకరాల 29 గుంటల భూమిని గుర్తించామన్నారు. జిల్లా కలెక్టర్ త్వరలోనే భూసేకరణ ప్రక్రియను...
మంత్రి కేటీఆర్‌తో గంటా శ్రీనివాసరావు భేటీ
హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ను తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం కలిశారు. శాసన సభ సమావేశాల సందర్భంగా బిజీగా ఉన్న కేటీఆర్‌తో అసెంబ్లీ టీ బ్రేక్ సమయంలో గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కేటీఆర్ మద్దతు తెలపడంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి...
యువత కోసం ఎంపీ రంజీత్ రెడ్డి చేస్తున్న కృషిని అసెంబ్లీ లో ప్రస్తావించిన మంత్రి కేటీఆర్
వికారాబాద్:చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఏర్పాటు అయ్యే పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఎంపీ డాక్టర్ రంజీత్ రెడ్డి” స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్” కోసం ఎంతో కృషి చేస్తున్నారని అసెంబ్లీ వేదికగా గౌరవ ఐటీ మంత్రి కేటీఆర్ గారు ప్రస్తావించారు.
చిరంజీవి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టం మరో ఉద్యమ వీరుడిని కోల్పోయింది. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన డాక్టర్ చిరంజీవి కొల్లూరి(74) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. చిరంజీవి మృతిపట్ల పలువురు నాయకులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఆయన కుటుంబం ఆస్పత్రి ఖర్చులు భరించలేని స్థితిలో ఉందని తెలుసుకున్న మంత్రి కేటీఆర్.....
అరకు విహరంలో విషాదం
విశాఖ జిల్లా అరకులోయలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళుతున్న బస్సు ప్రమాదవశాత్తు బోల్తాపడి లోయలోకి దూసుకెళ్లింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు మృతి చెందగా 19మంది గాయపడ్డారు. బస్సు ప్రయాణికులందరూ హైదరాబాద్‌కు చెందినవారుగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి అరకు వచ్చి.. తిరిగి వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనపై ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలని, బాధితులకు...
మా సహనాన్ని పరీక్షించొద్దు…బీజేపీ పై కేటీఆర్ ఫైర్
ఈరోజు మా పార్టీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటి పైన బిజెపి శ్రేణులు చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ఇలాంటి భౌతిక దాడులకు ఏ మాత్రం చోటు లేదు. ప్రజాస్వామ్యంలో తమ వాదనతో ప్రజలను ఒప్పించడం చేతకాక, ఇతర పార్టీలపైన భౌతిక దాడులు చేస్తూ తమ వాదన వినిపించాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీ తీరుని ప్రజాస్వామ్యవాదులు అంతా ఖండించాల్సిన అవసరం ఉన్నది. గతంలోనూ బీజేపీ భౌతిక దాడులకు ప్రయత్నించింది. రాజకీయాల్లో హేతుబద్ధమైన విమర్శలను దాటి, భౌతిక...
సిఎం కెసిఆర్ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం
పుట్టుకకు ముందు నుంచి మరణానంతరం వరకు అమలవుతున్న అనేక పథకాలు అంతా బాగుండాలి… అందులో మనముండాలన్నదే సీఎం కెసిఆర్ గారి లక్ష్యం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బలహీనులకు 10శాతం రిజర్వేషన్లపై హర్షాతిరేకాల వెల్లువ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతోపాటు, కెటిఆర్ ని ప్రగతి భవన్ లో కలిసిన పలు సామాజిక వర్గాల ప్రతినిధులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావుని,...
పట్టణ పేదలకు మెరుగైన వైద్య సేవలు : మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : పట్టణ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో డయాగ్నోస్టిక్ సెంటర్లను ప్రారంభిస్తున్నామని రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని శ్రీరామ్‌నగర్‌లో మంత్రి కేటీఆర్ డయాగ్నోస్టిక్ మినీ హబ్ సెంటర్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రెండేండ్ల కింద నారాయణగూడలో ఐపీఎం ప్రారంభించుకున్నాము. ఆ తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని,...
కేటీఆర్ పట్టాభిషేకం గురించి ఆయన తనయుడు హిమాన్షు ఏమన్నాడంటే…
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మంత్రి కేటీఆర్ గురించే చర్చ జరుగుతోంది. త్వరలోనే ఆయన్ను సీఎంగా చూస్తామని ప్రచారం జరుగుతోంది. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాలపై మంత్రి కేటీఆర్ తనయుడు, సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాని గురించి తనకు తెలియదని ఇంట్లో ఉన్నప్పుడు నాన్న, తాతయ్య రాజకీయాల గురించి చర్చించరని స్పష్టం చేశారు. బుధవారం ఇన్‌స్టగ్రామ్‌లో ”ఆస్క్ మీ వాటెవర్...