Home hyderabad

Tag: hyderabad

Post
తొమ్మిదేళ్ళ బాలికపై అత్యాచారయత్నం

తొమ్మిదేళ్ళ బాలికపై అత్యాచారయత్నం

క్రైం,తీస్మార్ న్యూస్:సైదాబాద్ ఘటన మరువకముందే హైదరాబాద్ లో మరో దారుణం చోటు చేసుకుంది.వివరాల్లోకి వెలితే మంగల్ హట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం..చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు.స్థానికులని చూసి సుమిత్ అనే నిందితుడు అక్కడ నుండి పరారైన్నట్టు తెలుస్తుంది.పరారీలో ఉన్న నిందుతుడిని అత్తాపూర్ వద్ద లంగర్ హౌస్ పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Post
మెడ్‌ట్రానిక్‌ కేంద్రాన్ని ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

మెడ్‌ట్రానిక్‌ కేంద్రాన్ని ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌: ప్రముఖ వైద్య పరికరాల తయారీ సంస్థ మెడ్‌ట్రానిక్‌ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్‌ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. అమెరికన్‌ సంస్థ అయిన మెడ్‌ట్రానిక్‌.. నగరంలోని నానక్‌రామ్‌గూడా బీఎస్‌ఆర్‌ టెక్‌పార్క్‌లో రూ.1200 కోట్లతో కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. ఇందులో ప్రపంచస్థాయి వైద్య పరికరాల ఇంజినీరింగ్‌, ఆవిష్కరణలు చేయనుంది. దీనిద్వారా హెల్త్‌కేర్‌ రంగంలో ఇంజినీరింగ్‌ చేసినవారికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అమెరికాలోని మిన్నెసోటా కేంద్రంగా మెడ్‌ట్రానిక్‌ పనిచేస్తున్నది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నది....

Post
రేపు సాయంత్రం నుండి వైన్స్ బంద్

రేపు సాయంత్రం నుండి వైన్స్ బంద్

హైదరాబాద్‌: హోలీ పండుగ సందర్భంగా రేపు, ఎల్లుండి మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. హోలీ సందర్భంగా రేపు ఎల్లుండి అంటే.. ఆదివారం సాయంత్రం 6 నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ ఆదేశాలు జారీ చేశారు.సోమవారం హోలీ పండుగ సందర్భంగా బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై వెళ్లే వ్యక్తులపై, వాహనాలు, స్థలాలపై రంగులు, రంగునీళ్లు చల్లవద్దని, ద్విచక్రవాహనాలు, కార్లపై గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రశాంతతకు భంగం కలిగిస్తే కఠిన...

Post
ఖైరతాబాద్‌లో మాదక ద్రవ్యాలు పట్టివేత..

ఖైరతాబాద్‌లో మాదక ద్రవ్యాలు పట్టివేత..

హైదరాబాద్‌ : ఖైరతాబాద్‌ ఎంఎస్‌ మక్తాలో బుధవారం ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు మాదక ద్రవ్యాలను పట్టుకున్నారు. 153 గ్రాముల కొకైన్‌, 16 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. అలాగే మాదక ద్రవ్యాల సరఫరా ఏజెంట్‌గా పని చేస్తున్న నైజీరియన్‌ జేమ్స్‌ మోరిసన్‌ను అరెస్టు చేశారు. ఆ వ్యక్తి ఉంటున్న ఎంఎస్‌మక్తాలోని నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. అతడిని అదుపులోకి తీసుకొని ఫోన్‌, తూకం పరికరం, డ్రగ్స్‌ సరఫరాకు సంబంధించిన వివరాలు రాసుకున్న నోట్‌బుక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ...

Post
వైఎస్ వ్యక్తిగత అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం

వైఎస్ వ్యక్తిగత అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం

హైదరాబాద్‌ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వ్యక్తిగత అనుచరుడిగా పని చేసిన సూరీడుపై ఆయన అల్లుడు సురేంద్రనాథ్‌రెడ్డి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలోకి ప్రవేశించి క్రికెట్‌ బ్యాట్‌తో దాడికి దిగాడు. గతేడాది కూడా సురేంద్రనాథ్‌ సూరీడుపై దాడికి పాల్పడ్డాడు. భార్యను వేధింపులకు గురి చేస్తుండడంతో గతంలో సురేంద్రనాథ్‌పై గృహహింస కేసు నమోదైంది. ఈ కేసును ఉపసంహరించుకోవాలని సూరీడుపై సురేంద్రనాథ్‌ ఒత్తిడి తీసుకువస్తున్నాడు. కేసును ఉపసంహరించుకోకపోవడంతో కక్షతో మామను హత్య చేసేందుకు యత్నించాడు. సూరీడు...

Post
క్షణికావేశంలో భార్యను హత్య చేసిన భర్త

క్షణికావేశంలో భార్యను హత్య చేసిన భర్త

హైదరాబాద్‌ : నగరంలోని రాజేందర్‌నగర్‌ హైదర్‌గూడలో దారుణం చోటు చేసుకుంది. క్షణికావేశంలో కట్టుకున్న భార్య సమత (26)ను భర్త రవి హత్య చేశాడు. ఈ విషాద ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మద్యం సేవించొద్దని చెప్పడంతో అర్ధరాత్రి వాగ్వాదానికి దిగి, హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Post
హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు..

హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు..

హైదరాబాద్‌ : మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 89 మంది అభ్యర్థులను ఎలిమినేట్‌ చేశారు. ఈ ప్రక్రియ ముగిసే వరకు లభించిన రెండో ప్రాధాన్యం ఓట్లు టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 6,930, బీజేపీకి 5,832, స్వతంత్ర అభ్యర్థి నాగేశ్వర్‌రావుకు 6,930, కాంగ్రెస్‌ అభ్యర్థికి 5,172 జమ చేశారు. ఎలిమినేషన్‌ ప్రక్రియ ముగిసే వరకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవికి 1,19,619 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుకు 1,10,500 ఓట్లు, ప్రొఫెసర్‌...

Post
హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు నిలిపివేత

హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు నిలిపివేత

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌ నగర్‌ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు నిలిచిపోయింది.రెండో ప్రాధాన్యతఓట్ల లెక్కింపులో తలెత్తిన గందరగోళంతో సిబ్బంది కౌంటింగ్‌ నిలిపివేశారు. 8 మంది అభ్యర్థుల ఎలిమినేషన్‌లో 50 ఓట్లు గల్లంతైనట్లు సిబ్బంది తెలిపారు. ఓట్ల గల్లంతుపై భాజపా-కాంగ్రెస్‌ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆర్వోకు ఫిర్యాదు చేశారు.  

Post
హైదరాబాద్‌లో తొలి ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు పూర్తి..

హైదరాబాద్‌లో తొలి ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు పూర్తి..

హైదరాబాద్‌ : మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తొలి ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. ఏడు రౌండ్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవి ఆధిక్యంలో ఉన్నారు. సమీప రామచందర్‌రావుపై 8,021 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఏడు రౌండ్లలో కలిపి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవికి 1,12,689 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుకు 1,04,668 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌రావుకు 53,610 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డికి 31,554 ఓట్లు, టీడీపీ అభ్యర్థి ఎల్‌ రమణకు...

Post
‘హైదరాబాద్‌’లో ఆరు రౌండ్లు పూర్తి.. ఆధిక్యంలోనే టీఆర్‌ఎస్

‘హైదరాబాద్‌’లో ఆరు రౌండ్లు పూర్తి.. ఆధిక్యంలోనే టీఆర్‌ఎస్

హైదరాబాద్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‎నగర్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకు ఆరు రౌండ్లు పూర్తయ్యాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవి 7,626 ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆరు రౌండ్లలో టీఆర్‌ఎస్‌కు 1,05,710 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుకు 98,084 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్‌ నాగేశ్వర్‎కు 50,450 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 29,627, టీడీపీ అభ్యర్థి ఎల్‌. రమణకు 5,606 ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఆరు రౌండ్లలో కలిపి...

  • 1
  • 2
  • 5